Pawan Kalyan, NTR : ఎన్టీఆర్‌కు లైన్ క్లియర్ చేసిన పవన్..
పెద్ద సినిమాలన్నీ వాయిదా పడడం కామనైపోయింది. కానీ.. దేవర మాత్రం ప్రీ పోన్ కావడం విశేషం. పవన్‌కల్యాణ్ ఆశీస్సులతో ఎన్టీఆర్ ముందే వచ్చేస్తున్నాడు.

All the big movies have been postponed. But.. Devara is special to be pre-poned.
పెద్ద సినిమాలన్నీ వాయిదా పడడం కామనైపోయింది. కానీ.. దేవర మాత్రం ప్రీ పోన్ కావడం విశేషం. పవన్‌కల్యాణ్ ఆశీస్సులతో ఎన్టీఆర్ ముందే వచ్చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న రావాల్సిన ఓజీ వాయిదా పడడంతో.. ఈ డేట్‌కే దేవర వస్తోందన్న ప్రచారం నిజమే అంటూ.. మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. ఏప్రిల్ 8న రావాల్సిన దేవర అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కాలేదు.
దీంతో సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 27న పవన్ ఓజీని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ చాలాకాలం క్రితమే ప్రకటించారు. అయితే ఆంధ్రాలో మారిన రాజకీయాల పరిస్థితులతో.. పవన్ ఇప్పట్లో సెట్స్‌పైకి వచ్చేట్టు కనిపించడం లేదు. ఓజీ రాదని తేలడంతో.. దేవర కర్చీఫ్ వేసేశాడు. సెప్టెంబర్ 27న ఓజీ రావడం లేదని.. లక్కీ భాస్కర్ టీం ముందే పసిగట్టింది. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబోలో రూపొందుతున్న లక్కీ భాస్కర్‌ను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు నెల క్రితమే ప్రకటించారు.
ఇదే రోజు దేవర రావడంతో.. లక్కీ భాస్కర్ మరో విడుదల తేదీ చూసుకోక తప్పడం లేదు. దేవరకు అక్టోబర్ 10 కంటే.. సెప్టెంబర్ 27నే బెటర్ ఆప్షన్. దసరాకు రెండు రోజుల ముందు దేవర వస్తే.. లాంగ్ వీకెండ్ తప్ప మరోటి లేదు. అదే సెప్టెంబర్ 27న వస్తే.. వీకెండ్‌తోపాటు.. అక్టోబర్ 2న గాంధీ జయంతి.. అలాగే.. దసరా హాలిడేస్ అన్నింటినీ కవర్ అవుతాయి. భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి అన్ని రకాలుగా బాగుందని ముందే వచ్చేస్తున్నాడు దేవర.