Mass heros : పక్కా మాస్ ఇమేజ్
కుర్ర హీరోలంతా మాస్‌నే నమ్ముకుంటున్నారు.. మాస్‌నే ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) డిఫరెంట్ సినిమాలు చేశారు. నా నువ్వు, 118, బింబిసార లాంటి సినిమాలు కళ్యాణ్ రామ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేసాయి.

All the boy heroes are believing in mass.. they are taking mass as an option.
A solid mass image
కుర్ర హీరోలంతా మాస్‌నే నమ్ముకుంటున్నారు.. మాస్‌నే ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) డిఫరెంట్ సినిమాలు చేశారు. నా నువ్వు, 118, బింబిసార లాంటి సినిమాలు కళ్యాణ్ రామ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేసాయి. అమిగోస్.. (Amigos) డెవిల్ లాంటి ప్రయత్నాలు కళ్యాణ్‌రామ్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలు కానీ కమర్శియల్ గా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో కళ్యాణ్ రామ్ అలెర్ట్ అయ్యాడు. తన మార్కెట్‌పై ప్రభావం పడడంతో మళ్లీ మాస్ కంటెంట్ వైపు ఛేంజ్ అయ్యాడు. ప్రస్తుతం ప్రప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ 21వ సినిమా తె రకెక్కుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇది పక్కా మాస్ చిత్రని తేలిపోయింది. కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేస్తోన్న చిత్రంలో హైలైట్ అవుతుంది.
ఇక.. మరో హీరో అల్లరి నరేష్ (Allari Naresh) కూడా కామెడీని పక్కన పెట్టేసి మాస్ ని నమ్ముకున్నట్టే కనిపిస్తోంది. మహర్షి తర్వాత న్యూ జానర్ సినిమాలు చేసినా నరేష్ కి కలిసి రాలేదు. దీంతో మళ్లీ కామెడీ జానర్ వైపు అడుగులు వేసాడు. అయినా ఆదరణ దక్కలేదు. దీంతో మళ్లీ పాత రూట్లోనే వెళ్లాలని నరేష్ ఫిక్సయినట్లున్నాడు. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో బచ్చలమల్లి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పుష్ప తరహా పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తుంది. నరేష్ న్యూ లుక్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంతవరకూ ఇలాంటి గెటప్ లో నరేష్ కనిపించకపోవడంతో అడియన్స్ ని కొత్త ఫీల్ ని అందిస్తున్నాడు.
యూత్ స్టార్ నితిన్ (Youth star Nitin) హీరోగా నటిస్తోన్న రాబిన్ హుడ్ కూడా పక్కా మాస్ చిత్రమని తెలుస్తోంది. చాలా కాలంగా నితిన్ కి సక్సెస్ లేదు.. ఎంత కష్టపడుతన్నా సక్సెస్ షేంక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. దీంతో వెంకీ కుడుమల ని రంగంలోకి దించి రాబిన్ హుడ్ చేస్తున్నాడు. ఇది పక్కా వెంకీ మార్క్ ఎంటర్ మాస్ టైనర్. సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. అటేజ మ్యాచో స్టార్ గోపీచంద్ పరిస్థితి ఇలాగే ఉంది. ఖాళీ లేకుండా సినిమాలైతే చేస్తున్నాడు గానీ, అందులో విజయాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం సినిమా చేస్తున్నాడు. ఇది వైట్ల మార్క్ మాస్ ఎంటర్ టైనర్ అని సమాచారం. ఇలా నయా హీరోలంతా మళ్లీ మాస్ చిత్రాలతోనే థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి ఈ కుర్ర హీరోలంతా మాస్ తోనే సక్సెస్ పక్కా అని ఫిక్సయినట్లున్నారు. మరి.. ఈ ఫ్లాప్ హీరోలు నమ్ముకున్న ఈ మాస్ సినిమాలైనా.. వీళ్లకు విజయాన్ని రుచి చూపిస్తాయో లేదో వేచి చూడాల్సిందే..