శోభిత పెళ్ళిలో వేసుకున్న నగలు అన్నీ పొన్నియం సెల్వం లో త్రిష, ఐశ్వర్యవే..?

సెలబ్రిటీ లో పెళ్లిళ్లకు మీడియాలో వెయిట్ ఎక్కువ. వాళ్ళు ధరించే నగలు అలాగే చీరలు అలాగే వాళ్ళు పెళ్లి ఏవిధంగా చేసుకుంటున్నారు... ఆ పెళ్లిలో వాడే వస్తువులు ఏంటీ... లేకపోతే ఆ పెళ్లి ఏ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుంది,

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2024 | 03:35 PMLast Updated on: Dec 11, 2024 | 3:35 PM

All The Jewelry Worn At Shobhitas Wedding Was Trisha And Aishwaryas In Ponniyum Selvam

సెలబ్రిటీ లో పెళ్లిళ్లకు మీడియాలో వెయిట్ ఎక్కువ. వాళ్ళు ధరించే నగలు అలాగే చీరలు అలాగే వాళ్ళు పెళ్లి ఏవిధంగా చేసుకుంటున్నారు… ఆ పెళ్లిలో వాడే వస్తువులు ఏంటీ… లేకపోతే ఆ పెళ్లి ఏ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా సామాన్య ప్రజలతో పాటుగా మీడియాకు కూడా ఆసక్తి ఎక్కువ. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇక ప్రతి విషయం కూడా హైలెట్ అవుతూనే ఉంది. ఇప్పుడు శోభిత దూళిపాళ్ల, నాగచైతన్య వివాహానికి మీడియా చాలా ప్రాధాన్యత ఇస్తుంది.

పెళ్లి జరిగిన తర్వాత కూడా మీడియాలో వీళ్ళిద్దరి గురించి ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే వస్తుంది. పెళ్లి తర్వాత దైవక్షేత్రాలకు అక్కినేని కుటుంబం మొత్తం వెళ్లడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో యమాగా వైరల్ కావడం కూడా జరిగింది. ఇక పెళ్లి ఫోటోలకు అయితే సోషల్ మీడియాలో పిచ్చ క్రేజ్ ఉంది. సాధారణంగా మహిళలు ధరించే ఆభరణాలు అలాగే చీరలు వంటి వాటిని జనాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. సినిమా ప్రముఖులు ఖరీదు ఎక్కువైన ఆభరణాలు ధరిస్తారు… కాబట్టి మీడియా కూడా వాటిని హైలెట్ చేస్తూ ఉంటుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రీల్ వైరల్ అవుతుంది. శోభిత ఈ పెళ్లిలో ధరించిన ఆభరణాలు ఒక సినిమాలో ఉపయోగించినవే అని… లేదంటే అదే మోడల్ ఆభరణాలు చేయించుకుంది అంటూ ఓ రీల్ చక్కర్లు కొడుతోంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోన్నియన్ సెల్వం సినిమాలో ఐశ్వర్యరాయ్ అలాగే త్రిష ధరించిన ఆభరణాలే పెళ్లిలో శోభిత ధరించింది అంటూ అవి గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఆ సినిమాలో శోభిత కూడా నటించింది. అయితే ఆ నగలు బాగా నచ్చడంతో మళ్ళీ అవే నగలను బంగారంగా చేయించుకుందట.

అసలు కాదు… పెళ్లిలో బాగుంటాయని ఆమెనే అడిగి తీసుకుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఐశ్వర్య ధరించిన ఒక హారం అలాగే త్రిష ధరించిన మినీ హారం శోభిత రెండు కలిపి పెళ్లిలో ధరించింది. దీనిని దగ్గరగా గమనించిన వారు శోభిత పోన్నియన్ సెల్వం సినిమాలో వాడిన నగలనే ధరిస్తా అని చెప్పడంతో అక్కినేని ఫ్యామిలీ ఆమెకు ఏ నగలు చేయించలేదు అంటూ కొన్ని రూమర్స్ వైరల్ చేస్తున్నారు. మరి నిజం ఏంటో శోభిత చెప్తే తప్ప తెలియదు. ప్రస్తుతం శోభిత నాగచైతన్య ఇద్దరు అమెరికా పర్యటనకు వెళ్లే ఛాన్స్ కనబడుతోంది. నాగచైతన్య తల్లి లక్ష్మీ వీళ్లిద్దరిని అమెరికా తీసుకెళ్తానని చెప్పినట్లుగా సమాచారం.