Star Hero Movies: వచ్చేదంతా పాన్ ఇండియా ఫైట్
కంటెంట్ లో దమ్ముంటే అందులో యాక్టర్స్ ఎవరనేది పట్టించుకోవడం లేదు ఆడియన్స్.

All the movies of star heroes that will be released during Dussehra are at Pan India level
కంటెంట్ లో దమ్ముంటే అందులో యాక్టర్స్ ఎవరనేది పట్టించుకోవడం లేదు ఆడియన్స్. అందుకే సినిమాల పోటీ ఎక్కువైంది. ఒకే రోజు నాలుగు, ఐదు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ పోటీలో చిన్న సినిమాలకి స్కోప్ తక్కువ ఉన్న కాస్తా ఫేమ్ ఉన్న హీరోలకి మాత్రం ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయి.ఇదే ఇప్పుడు ఆరు సినిమాల మధ్య బిగ్ ఫైట్ కి కారణమైంది.రెండు రోజుల గ్యాప్ లో బింగ్ క్లాష్ జరిగేందుకు రంగం సిద్ధమౌతోంది. వచ్చే దసరాకి పాన్ ఇండియా స్టార్స్ మధ్య భారీ ఫైట్ షురూ కాబోతోంది. రెండు రోజుల గ్యాప్ లో ఏకంగా ఆరు సినిమాలు బాక్సాఫీస్ పై ఎటాక్ చేయబోతున్నాయి.ఇందులో ముందుగా అక్టోబర్ 19న రిలీజ్ కాబోతోంది భగవంత్ కేసరి. అఖండ, వీరసింహారెడ్డి లాంటి సక్సెస్‌ల తర్వాత బాలయ్య చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే దీనికి పోటీగా అదే రోజు విజయ్ లియో ,శివరాజ్ కుమార్ ఘోస్ట్ పాన్ ఇండియా బ్రాండ్ తో థియేటర్స్ లోకి రాబోతున్నాయి.అంటే భగవంత్ కేసరికి ఈ రెండు సినిమా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది.. అక్టోబర్ 20న మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న బయోపిక్ మూవీ టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. అదే రోజు కన్నడ నుంచి రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన సప్తసాగర దాచి ఎల్లో మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది.అలాగే హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన గణపత్ మూవీ అక్టోబర్ 20నే బాలీవుడ్ తో పాటు తెలుగులోను డబ్ అయ్యి వస్తోంది.
మొత్తానికి దసరా సీజన్ పై పాన్ ఇండియా స్టార్స్ గట్టిగానే ఫోకస్ చేశారు. రెండు రోజుల గ్యాప్ లో ఏకంగా 6 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో రెండు మాత్రమే స్ట్రైట్ తెలుగు సినిమాలు. మిగిలినవి డబ్బింగ్ మూవీస్. వీటిలో ‘టైగర్ నాగేశ్వరరరావు’,ఘోస్ట్, లియోపై హెవీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఏ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందో…పాన్ ఇండియా రేంజ్ లో భారీ కలక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.