ఆల్ టైం పుష్ప రికార్డు …. దేవరలానే 1000 కాదు 999 కోట్లు..
దేవర విడుదలకు ముందే 650 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసింది.అది కూడా ఓవర్ సీస్ బిజినెస్ కాకుండానే, ఆడియో రైట్స్ సేల్ చేయకుండానే. వాటితో కలిసి 800 కోట్ల వరకు దేవర ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదలయ్యాక 12 రోజులకే ఆల్ మోస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ తాలూకు బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది.
దేవర విడుదలకు ముందే 650 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసింది.అది కూడా ఓవర్ సీస్ బిజినెస్ కాకుండానే, ఆడియో రైట్స్ సేల్ చేయకుండానే. వాటితో కలిసి 800 కోట్ల వరకు దేవర ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదలయ్యాక 12 రోజులకే ఆల్ మోస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ తాలూకు బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. దీంతో పుష్పరాజ్ పంట పండినట్టుంది. ఒక హిట్ మరో సినిమాను ఇంకో మెట్టెపైకెక్కిస్తుందంటారు. దేవర ఇచ్చిన ధైర్యంతో పుష్ప సీక్వెల్ కి ఎక్కడ లేని ఊపొచ్చింది. రిలీజ్ కిముందే ఈ మూవీ 1000 కోట్ల బిజినెస్ చేసిందంటున్నారు. కాకపోతే అందులో చిన్న లెక్క తప్పు.. ఈమూవీ ప్రీరిలీజ్ బిజినెస్ 999 కోట్లని తేలుతోంది. ఆ ఒక్క కోటి కలిస్తే థౌజెండ్ వాలనే. ఐతే పుష్ప 2 కి, దేవరకి ఓటీటీ రైట్స్ విషయంలో సిమిలారిటీ ఉంది… ప్రీరిలీజ్ బిజినెస్ లో కూడా సిమిలారిటీ ఉంది. కాకపోతే, ఎక్కడ డిసెంబర్ లో తగ్గాల్సి వస్తుందో అని కంగారు పడ్డ పుష్పరాజ్ కి, దేవర ఇచ్చిన 800 కోట్ల ధైర్యం, ఊపిరిపోస్తోంది… అదెలానో చూసేయండి…
పుష్ప రాజ్ తగ్గనన్నాడు నిజంగానే తగ్గలేదని ప్రూవ్ చేశాడు. పుష్ప ది రైజ్ వచ్చి 3ఏళ్లు దగ్గరపడుతోంది. మొదటి పార్ట్ 250 కోట్లు పెట్టి తీస్తే 450 కోట్లొచ్చాయి. ఇప్పుడు రెండో పార్ట్ ని 450 నుంచి 500 కోట్లతో రెండేళ్లుగా తీస్తూనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు ఈ సినిమా డిసెంబర్ 6 కి రాదని, వచ్చినా వసూళ్ళ వరద కష్టమని అన్నారు. తీరా చూస్తే రిలీజ్ కి ముందే ఆల్ మోస్ట్ 1000 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది పుష్ప 2
దేవర ఇచ్చిన ధైర్యమా, దేవర చూపించిన మార్గామా కాని పుష్పరాజ్ కి దేవర బాగా కలిసొచ్చింది. ప్యాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ దద్దరిల్లాలంటే మన తెలుగు స్టార్లకే ఆ దమ్ముందనే ధైర్యాన్ని, ఎన్టీఆర్ క్రియేట్ చేశాడు. దెబ్బకి పుష్ప 2 కి పాన్ ఇండియా లెవల్లో డిమాండ్ పెరిగింది.
దేవర మిక్స్ డ్ రివ్యూలొస్తేనే విడుదలైన 12 రోజుల్లో ఆల్ మోస్ట్ 800 కోట్లు రాబట్టింది. అలాంటిది పుష్ప హిట్ మూవీ అవటం, దానికి సీక్వెల్ గా పుష్ప 2 వస్తుండటంతో, ఇదేం బ్రహ్మండం చేస్తుందో అని ఓటీటీ సంస్థలనుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు భారీగా క్యూ కట్టారు
అలా దేవర ఓటీటీ రైట్స్ ఈ సినిమా రిలీజై బ్లాక్ బస్టరయ్యాక 270 కోట్లకు కొనేశాయి ఓటీటీ సంస్థలు. కాని పుష్ప 2 ఓటీటీ రైట్స్ ని విడుదలకు ముందే ఆల్ మోస్ట్ అంతే మొత్తం తో కొనేశారు. సో ఒక తెలుగు మూవీ హిట్టైతే మరో సినిమా పండగ చేసుకునే పరిస్థితులు కేవలం టాలీవుడ్ లోనే కనిపిస్తున్నాయి
ఇక ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ ఏకంగా 15 మిలియన్లు. అంటే 120 కోట్లకు అమ్ముడు పోయింది. కల్కీ కూడా అంత భారీ ఎమౌంట్ కి సేల్ కాలేదు. 90 కోట్లకే ఓవర్ సీస్ రైట్స్ సేల్ అయ్యాయి. కాకపోతే సలార్, కల్కీ, దేవర ఇలా వరుసగా తెలుగు పాన్ ఇండియా మూవీలు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుండటంతో, హిట్ మూవీకి సీక్వెలైన పుష్ప 2 కి ఆటో మేటిగ్గా డిమాండ్ పెరుగుతుంది…
సో అదే ఇక్కడ కలిసొచ్చినట్టుంది. లేకపోతే ఓవర్ సీస్ రైట్స్ 15 మిలియన్ డాలర్స్ కి సేల్ అవటమేంటి? ఇది నిజంగా రికార్డు. ఇదే కాదు హింద వర్షన్ పుష్ప థియేట్రికల్ రైట్స్ 310 కోట్లు వరకు సేల్ అయ్యాయని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ రైట్స్ దాదాపు 65 కోట్లు పలికాయని తెలుస్తోంది.
సో 270 కోట్ ఓటీటీ రైట్స్, 120కోట్ల ఓవర్ సీస్ రైట్స్, అలానే నార్త్ ఇండియా తాలూకు 300 కోట్ల రైట్స్ కలిపితేనే, 690 కోట్ల లెక్కతేలింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ రైట్స్ 65 కోట్లు కలిపితే 759 కోట్ల లెక్కతేలింది.
ఇక తెలుగు రాష్రాల రైట్స్ 150 కోట్ల కు ఆల్ మోస్ట్ డీల్ సెట్ అయినట్టే తెలుస్తోంది. తమిల్, మలయాళం, కన్నడ రైట్స్ విచిత్రంగా 100 కోట్లని తెలుస్తోంది. మొత్తం లెక్కేస్తే 999 నెంబర్ తేలింది. అంటో ఆల్ మోస్ట్ పుష్ప 2 రిలీజ్ కి ముందే వెయ్యికోట్ల క్లబ్ లో చేరుతున్నాడు. అచ్చంగా దేవర దారిలోనే పుష్ప 2 పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవర పుణ్యమాని పుష్పరాజ్ కి పాజిటివ్ పవనాలు పెరిగాయి.