ముంబై తెల్ల తోలు వేస్ట్ సాయి పల్లవి బెస్ట్, అల్లు అరవింద్ కామెంట్స్

లేడీ పవర్ స్టార్ గా సౌత్ ఇండియన్ సినిమాలో దుమ్ము రేపుతున్న సాయి పల్లవి, ఇప్పుడు తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తన రోల్ కు ప్రయారిటీ ఉండే పాత్రలు మాత్రమే సెలెక్ట్ చేసుకున్న సాయి పల్లవి...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2025 | 04:00 PMLast Updated on: Feb 07, 2025 | 4:01 PM

Allu Aravind Comments On Sai Pallavi

లేడీ పవర్ స్టార్ గా సౌత్ ఇండియన్ సినిమాలో దుమ్ము రేపుతున్న సాయి పల్లవి, ఇప్పుడు తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తన రోల్ కు ప్రయారిటీ ఉండే పాత్రలు మాత్రమే సెలెక్ట్ చేసుకున్న సాయి పల్లవి… ప్రస్తుతం తండేల్ సినిమాలో సత్య పాత్రలో యాక్ట్ చేస్తోంది. చందు మొండేటి డైరెక్షన్ లో… నాగచైతన్య హీరోగా వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి డాన్స్ తో కూడా దుమ్ము రేపుతోందని క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్లో ఆమె డాన్స్ కు అభిమానులు సినిమా రిలీజ్ కు ముందే ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోలు యమాగా వైరల్ అవుతున్నాయి. అమ్మాయిలు అయితే రీల్స్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ సౌత్ ఇండియాలో గట్టిగానే చేస్తున్నారు. రీసెంట్ గా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అల్లు అరవింద్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సాయి పల్లవిని ఎంపిక చేయడానికి గల కారణాన్ని వివరించారు. ఈ సినిమాలో సాయి పల్లవి ఎంపిక తన నిర్ణయం అన్నారు అల్లు అరవింద్.

ఇది కమర్షియల్ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని, ఈ పాత్ర కోసం తాను ముంబై వెళ్లి ఎవరిని తీసుకురాలేదని, ముంబై నుంచి వైట్ స్కిన్ అమ్మాయిలను తీసుకొచ్చినా… ఈ పాత్రకు జీవం తీసుకురాలేరని అనిపించింది అంటూ ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇది ఎన్నో ఎమోషన్స్ తో కూడిన సినిమా అని, ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండి పోతుందని, అల్లు అరవింద్ కాన్ఫిడెంట్ గా చెప్పారు. అందుకే సాయి పల్లవిని తీసుకున్నట్లు చెప్పిన ఆయన… సాయి పల్లవి హండ్రెడ్ పర్సెంట్ పాత్రకి న్యాయం చేసిందన్నారు.

ఇక పుష్ప సీక్వెల్ సక్సెస్ గురించి కూడా అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ క్రెడిట్ మొత్తం సుకుమార్ కు దక్కుతుందన్నారు అల్లు అరవింద్. అల్లు అర్జున్… సుకుమార్ చాలా మంచి ఫ్రెండ్స్ అని, పుష్ప మొదటి పార్ట్ నుంచి ఈ మ్యాజిక్ ఇంటర్నేషనల్ వైడ్ గా చరిత్ర సృష్టించిందని కామెంట్ చేశారు. ఇక తండెల్ సినిమా విషయంలో తాను చాలా హోప్స్ పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా నాగచైతన్యతో పాటుగా సినిమా యూనిట్ మొత్తానికి ది బెస్ట్ గా నిలవబోతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఈ సినిమా విషయంలో తాను ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నారు. సినిమా షూటింగ్ కు అవసరమైన బడ్జెట్ ఎంతైనా సరే ఇవ్వడానికి తన సిద్ధంగా ఉన్నానని, ఇక డైరెక్టర్ చందూ కూడా తమను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదని కామెంట్ చేశారు అల్లు అరవింద్. నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఉత్తరాంధ్రలో మత్స్యకారుల బ్యాక్ గ్రౌండ్ లో రానుంది.