Allu Arvind: ప్రభాస్ కోసం రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. సలార్ లెక్కలు మారిపోనున్నాయి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ సినిమాలు ఈ ఇయర్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ కాబోతుండగా.. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Salaar Movie Theartical rights try to allu Arvind
ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే దక్కించుకుంది. దీనికోసం భారీగా డబ్బులు చెల్లించినట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ ఎంత ప్రయత్నించినా ఆదిపురుష్‌ను దక్కించుకోలేకపోయాయి. అయితే తరువాత రాబోతున్న సలార్ మూవీకోసం గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. సలార్ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం అల్లు అరవింద్ ట్రై చేస్తున్నారట.
ఈ డీల్ విషయంలో ప్రస్తుతం డిస్కర్షన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆదిపురుష్ రిలీజ్ తరువాత ఈ డీల్ విషయంలో క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ఫస్ట్ డే సినిమా గురించి పాజిటివ్ టాక్ వస్తే ఓకే.. కానీ మూవీ కాస్త అటూ ఇటూ అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నష్టపోయి ఉంటుంది కాబట్టి సలార్ రైట్స్ కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే వెళ్లే చాన్స్ ఉంది. అలా కాకపోతే దాదాపుగా సలార్ సినిమా గీతా ఆర్ట్స్ చేతికే వస్తుంది. నిజానికి సలార్‌ని అల్లు అరవింద్‌కు ఇవ్వడమే బెటర్ అనే ఆలోచనలో మేకర్స్ కూడా ఉన్నట్టు సామాచారం. ఎందుకంటే అల్లు అరవింద్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వేరే లెవెల్‌లో ఉంటాయి. ఇది సలార్ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.