Allu Aravind: ఒక్కటి తగ్గింది.. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మిస్సింగ్.. అరవింద్ ఎక్కడ..!
వరుణ్ పెళ్లిలో చిరంజీవి అమ్మగారు కాకుండా.. మరో ఇంపార్టెంట్ పర్సన్ మిస్ అయ్యారు. అది ఎవరో కాదు అల్లు అరవింద్. బన్నీ ఫాదర్ అల్లు అరవింద్ ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఎంగేజ్‌మెంట్‌లో సందడి చేసిన అల్లు అరవింద్.. పెళ్ళిలో ఎందుకు కనిపించలేదు అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
Allu Aravind: ఐదేళ్లు సీక్రెట్‌గా ప్రేమించుకుని.. ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. వారి ప్రేమను పెద్దలకు చెప్పి.. ఇరు కుటుంబాల సమక్షంలో అంగ రంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే మెగా హీరోలు అంతా ఓకే ఫ్రేములో ఉన్న ఫోటో అయితే నెట్టింట షేక్ చేస్తుంది.అయితే ఈ పిక్స్ చూసిన వారంతా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మిస్ అయ్యాడని చర్చించుకుంటున్నారు.
వరుణ్ పెళ్లిలో చిరంజీవి అమ్మగారు కాకుండా.. మరో ఇంపార్టెంట్ పర్సన్ మిస్ అయ్యారు. అది ఎవరో కాదు అల్లు అరవింద్. బన్నీ ఫాదర్ అల్లు అరవింద్ ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఎంగేజ్‌మెంట్‌లో సందడి చేసిన అల్లు అరవింద్.. పెళ్ళిలో ఎందుకు కనిపించలేదు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అది కూడా మెగా ఫ్యామిలీకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కావడంతో.. ఏమైందా అని కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అరవింద్ లేకుండా మెగా ఫ్యామిలీలో ఏ ఈవెంట్.. ఏ పండుగ జరగదు. మరి అలాంటిది ఎందుకు ఆయన రాలేదు..? ఎందుకు ఆయన లేకుండానే ఈ పెళ్లి జరిగింది..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అల్లు అరవింద్ ‘చావు కబురు చల్లగా’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో లావణ్య మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకున్న అల్లు అరవింద్.. ‘ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది.
ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది’ అని ఆమె గురించి చెప్పుకొచ్చాడు. ఇక అదే మాటను లావణ్య నిజం చేసింది. అల్లు అరవింద్ చెప్పిన మాట తరువాతే లావణ్య-వరుణ్ ప్రేమాయణం బయటపడింది. నిజం చెప్పాలంటే.. వీరి పెళ్లి జరగడానికి కారణం అంటే మొదట అల్లు అరవింద్ పేరే చెప్పుకోవాలి. అలాంటి ఆయన కనిపించకపోవడంతో అభిమానులకు కొత్త డౌట్లు పుట్టుకువస్తున్నాయి. ఈ విషయంపై అల్లు లేదా మెగా కుటుంబం నుంచి ప్రకటన వస్తే.. ఫ్యాన్స్‌లో డౌట్స్ తీరిపోతాయి.