టార్గెట్ అల్లు అరవింద్, తండెల్ రూపంలో ఐటీ ముప్పు
టాలీవుడ్ లో ఐటీ దాడులు మూడు రోజులు పాటు చుక్కలు చూపించాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాగే పుష్ప సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్... ఆ తర్వాత మాంగో మీడియా, అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సుకుమార్
టాలీవుడ్ లో ఐటీ దాడులు మూడు రోజులు పాటు చుక్కలు చూపించాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాగే పుష్ప సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్… ఆ తర్వాత మాంగో మీడియా, అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సుకుమార్ రైటింగ్స్ తో పాటుగా మొత్తం 15 మంది నిర్మాతలు ఫైనాన్సర్లపై ఐటి దాడులు జరిగాయి. ఇందులో భారీ చిత్రాలను నిర్మించింది దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే. మరి వేరే వాళ్ళపై ఎందుకు దాడి జరిగింది అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐటీ దాడుల వ్యవహారం కచ్చితంగా భయపెడుతుందని చెప్పాలి.
దీనిపై నిర్మాతలు దర్శకులు ఇవి సర్వసాధారణమే రెండేళ్లకు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయని చెప్తున్నా.. ఎన్నడూ లేని విధంగా ఐటీ శాఖ ఈసారి 15 మంది సినీ ప్రముఖులపై దాడి చేసింది. సినిమాలకు భారీ వసూళ్లు రావడంతో ఐటీ అధికారులు గట్టిగానే గురి పెట్టారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో సినిమా వాళ్ళపై ఐటి అధికారులు ఎందుకు గురి పెట్టారు అనేదానిపై క్లారిటీ రావటం లేదు. అయితే వాళ్ల తర్వాతి టార్గెట్ అల్లు అరవింద్ అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అరవింద్ నాగచైతన్యతో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు.
తాజాగా జరిగిన ఈ ఫిల్మ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నామన్నారు. చైతు కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాఫర్ గా నిలుస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. అలాగే ఈ సినిమాకు చైతన్య భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కూడా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. మరి దీనికి ఐటి దాడులకు సంబంధం ఏంటి అంటారా…? ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడులు ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు పైన జరుగుతున్నాయి. అలాగే భారీ బడ్జెట్ సినిమాలు చేసిన నిర్మాతలు పైనే ఫోకస్ చేస్తున్నారు.
కాబట్టి కచ్చితంగా అల్లు అరవింద్ పై తర్వాత ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం జరిగిన రచ్చతో కచ్చితంగా అల్లు అరవింద్ జాగ్రత్త పడే అవకాశాలు కూడా ఉండవచ్చు. సినిమా వసుళ్ళ విషయంలో గతంలో మాదిరిగా అనౌన్స్మెంట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఐటి వాళ్ళ టార్గెట్ ఎక్కువగా మైత్రి మూవీ మేకర్స్ పైనే ఉందనే చర్చలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో వెనుక ముందు చూడకుండా వీళ్లు పెట్టుబడి పెట్టేస్తున్నారు. అటు దిల్ రాజు కూడా దాదాపుగా ఇదే రూట్ లో వెళ్తున్నారు. అందుకే కాస్త గట్టిగానే వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐటీ అధికారులకు దాదాపు 600 కోట్లకు సంబంధించి లెక్కలు తారుమారైనట్లు ఆధారాలు దొరికాయి అనే ప్రచారం జరిగింది. మరి వాటిపై ఫైనాన్స్ ఇస్తారని వార్తలు వచ్చాయి. మరి ఏం జరుగుతుందో.