Allu Arha: అల్లు అర్హ 1 నిమిషం రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..

స్టార్‌ హీరోల పిల్లలు అప్పుడే స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చి సంపాదించడం మొదలుపెట్టారు. తండ్రుల స్టార్‌డంతో చిన్న వయసులోనే వీళ్లు కూడా స్టార్లుగా మారిపోతున్నారు. తండ్రులకు ఏమాత్రం తగ్గకుండా లక్షల్లో రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 16, 2023 | 01:36 PMLast Updated on: Jul 16, 2023 | 1:36 PM

Allu Arha Movie Remunaration In Devara Movie

రీసెంట్‌గా మహేష్‌ బాబు కూతురు సితార ఓ జ్యువెల్లరీ యాడ్‌ ప్రమోషన్‌ చేసింది. ఆ యాడ్‌ కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్‌ అక్షరాల కోటి రూపాయలు. షాకింగ్‌గా ఉంది కదా. ఈ రోజుల్లో ఒక మిడ్‌ రేంజ్‌ హీరోయిన్‌ ఫుల్‌ లెంత్‌ సినిమా కోసం కూడా అంత రెమ్యునరేషన్‌ తీసుకోదు. కానీ సితార మాత్రం జస్ట్‌ యాడ్‌ కోసం కోటి తీసుకుంది. ఇక ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూతురు అర్హ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది. రీసెంట్‌గా శాకుంతలం సినిమాతో స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్హ ఎన్టీఆర్‌ హీరోగా వస్తున్న దేవర సినిమాలో కూడా ఓ చిన్న క్యారెక్టర్‌ చేయబోతోందట.

సినిమాలో అర్హ క్యారెక్టర్‌ 10 నిమిషాలు మాత్రమే ఉంటుందట. ఆ క్యారెక్టర్‌ కోసం అర్హ తీసుకోబోయే రెమ్యునరేషన్‌ నిమిషానికి రెండు లక్షలు. అంటే 10 నిమిషాలకు అక్షరాలు 20 లక్షలకు. యావరేజ్‌గా ఇంత సంపాదించాలి అంటే నార్మల్ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ మూడు నాలుగు సినిమాలు చేయాలి. ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఐతే కనీసం సంవత్సరం పడుతుంది. కానీ ఈ స్టార్‌ కిడ్స్‌ మాత్రం కిండర్‌గార్టెన్‌ ఏజ్‌ లోనే నిమిషాల్లో లక్షలు సంపాదిస్తున్నారు. అది స్టార్‌డం అంటే. అందుకే.. పుడితే స్టార్‌గానే పుట్టాలి అంటున్నారు ఈ న్యూస్‌ విన్న సినిమా ఫ్యాన్స్‌.