ALLU ARJUN: బన్నీ ఫ్యాన్స్ తలెత్తుకునే డిసిషన్.. పాట షూట్ కోసం డేరింగ్ స్టెప్

సరైనోడు సినిమాలోని "తెలుసా తెలుసా.. ప్రేమించానని" అనే పాటను ఇండియాలో ఇప్పటివరకు ఏ చిత్రం షూటింగ్ చేయని ప్రాంతంలో షూట్ చేశారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 04:21 PMLast Updated on: Dec 21, 2023 | 4:21 PM

Allu Arjun About Sarrainodu Movie Song Video Goes Viral On Social Media

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు.

DUNKI REVIEW: ‘డంకీ’ యావరేజ్.. ‘సలార్’ సునామి ఖాయం

మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. దీంతో నిర్మాతలు స్వల్ప నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో అల్లు అర్జున్ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన వీడియోను ఇప్పుడు ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. సరైనోడు సినిమాలోని “తెలుసా తెలుసా.. ప్రేమించానని” అనే పాటను ఇండియాలో ఇప్పటివరకు ఏ చిత్రం షూటింగ్ చేయని ప్రాంతంలో షూట్ చేశారట. అంతేకాదు.. ఈ పాట కోసం నాలుగు విమానాలు మారడంతో పాటు 54 గంటల జర్నీ చేశారట.

ఎవరూ కన్నెత్తి కూడా చూడని ప్రాంతంలో మనం షూటింగ్ చేయాల్సిందే అని హీరో అల్లు అర్జున్ పట్టుబడటంతో చేశారట. దీనిని స్వయంగా అల్లు అర్జునే చెప్పారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, పాన్ ఇండియా రేంజ్‌లో వసూళ్లు కొల్లగొట్టిన మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏకంగా నేషనల్ అవార్డును అందుకుంది. ఇప్పుడు దీనికి పార్ట్ 2గా వస్తున్న సినిమా కూడా అదే రేంజ్‌లో అదరగొడుతుందని పుష్ప టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది.