ALLU ARJUN: ఏపీ సీఎం జగన్‌కు స్టైలిష్ స్టార్‌ ఝలక్‌..!

ఇప్పుడు యాప్‌ కోసం ఓ యాడ్ చేశారు. అందులో ఆటో వెనక ఆ సంస్థ పోస్టర్లు అంటిస్తారు. ప్రతీ శుక్రవారం వేరే ఊళ్లలో ఉద్యోగాలు చేసుకునే వారు.. వీకెండ్స్‌లో ఇంటికి రావాలంటే.. తమ యాప్‌ను ఉపయోగించి బుక్ చేసుకోండి అని ఉంటుంది. యాడ్ ఏంది అన్నది పక్కనపెడితే.. యాడ్ ప్రారంభంలో ఆంధ్రాలో ఉద్యోగాలు లేవు కాబట్టి.. హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తుంది అని చూపిస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2023 | 05:34 PMLast Updated on: Nov 20, 2023 | 5:43 PM

Allu Arjun Ad Creates Controversy In Ap About Ys Jagan

ALLU ARJUN: సినిమా హీరోలు కమర్షియల్ యాడ్స్‌ చేయడం అనేది కొత్తేం కాదు. మన టాలీవుడ్‌లో ఇది మరీ కామన్‌. ఏ హీరో సినిమా హిట్ అయినా.. స్టార్‌డమ్‌ తెచ్చుకున్నా.. సంస్థలన్నీ హీరో ఇంటి ముందు వాలిపోతుంటాయ్. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. ఓ ట్రావెల్‌ యాప్‌ కోసం స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ చేసిన యాడ్‌.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా జగన్‌కు, ఏపీ సర్కార్‌కు షాక్ ఇచ్చినట్లు ఆ యాడ్ కనిపిస్తుందనే టాక్‌ వినిపిస్తోంది. కొంతకాలంగా ఆ యాప్‌ కోసం అల్లు అర్జున్.. బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు.

PAWAN KALYAN: తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం.. 22న వరంగల్‌లో రోడ్డు షో..!

ఇప్పుడు యాప్‌ కోసం ఓ యాడ్ చేశారు. అందులో ఆటో వెనక ఆ సంస్థ పోస్టర్లు అంటిస్తారు. ప్రతీ శుక్రవారం వేరే ఊళ్లలో ఉద్యోగాలు చేసుకునే వారు.. వీకెండ్స్‌లో ఇంటికి రావాలంటే.. తమ యాప్‌ను ఉపయోగించి బుక్ చేసుకోండి అని ఉంటుంది. యాడ్ ఏంది అన్నది పక్కనపెడితే.. యాడ్ ప్రారంభంలో ఆంధ్రాలో ఉద్యోగాలు లేవు కాబట్టి.. హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తుంది అని చూపిస్తారు. దీనిపై వైసీపీ అభిమానులు గుర్రుమంటున్నారు. దీంతో యాడ్ కాస్త పొలిటికల్ రంగు పులుముకుంటోంది. ఏపీలో ఉద్యోగాలు లేవని.. హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని.. ఇది ఏపీ సీఎం జగన్ పనితీరు అంటూ టీడీపీ శ్రేణులు, ఐటీడీపీ విభాగం భారీగా ట్రోల్ చేస్తున్నాయ్. జగన్ సర్కార్‌పై ఈ కామెంట్స్‌ యాడ్ చేసి.. మీమ్స్‌తో ప్రచారాన్ని మరింత స్పీడప్ చేస్తున్నారు. ఇక్కడితో ఆగారా అంటే.. జగన్‌కు అల్లుఅర్జున్‌ భలే ఝలక్ ఇచ్చారని.. ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని మరికొందరు అంటుండడం.. కొత్త వివాదానికి కారణం అవుతోంది.

దీన్ని వైసీపీ శ్రేణులు దీటుగా తిప్పికొడుతున్నాయ్. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలించారని.. అప్పుడు హైదరాబాద్ నుంచి ఎంతమందిని తెచ్చి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయ్. హైదరాబాదులో ఉన్న వారంతా చంద్రబాబు అభిమానులేనని చెప్పుకుంటున్నారని.. మొన్న ఆయన అరెస్టుతో నిరసన తెలిపింది తమ వారేనని చెప్పుకోవడం మరిచిపోయారా అంటూ రిటర్న్‌ కామెంట్‌ చేస్తున్నారు. దీంతో ఒక్క యాడ్ ఇప్పుడు తీవ్ర వివాదాలకు కారణం అవుతోంది. మరి బన్ని దీని మీద రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.