ALLU ARJUN: అల్లు అర్జున్‌తో బోయపాటి.. మాస్ కాంబో రీ యూనియన్..
బన్నీ-బోయపాటి కాంబోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయని గీతా ఆర్ట్స్ ప్రకటించింది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, వివిధ కారణాలతో వాయిదా పడింది.

ALLU ARJUN: అల్లు అర్జున్‌న మాస్‌కు చేరువ చేసిన సినిమా సరైనోడు. బన్నీలోని అసలైన మాస్ నటుడ్ని వెలుగులోకి తెచ్చింది ఈ సినిమా. బోయపాటి శీను ఈ చిత్రానికి దర్శకుడు. 2016లో వచ్చిన ఈ కాంబో మళ్లీ రిపీట్ కానుంది. త్వరలో బోయపాటి-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందనుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు. దీనిపై నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన కూడా చేసింది.
Thalapathy Vijay: చిరు, పవన్ దారిలోనే దళపతి విజయ్ ?
బన్నీ-బోయపాటి కాంబోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయని గీతా ఆర్ట్స్ ప్రకటించింది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, వివిధ కారణాలతో వాయిదా పడింది. పైగా బన్నీ.. పుష్ప కోసం దాదాపు నాలుగేళ్లు తీసుకోవడంతో కూడా ఆ క్రేజీ కాంబోకు బ్రేక్ పడింది. ఇన్నాళ్లకు ఈ కాంబో సెట్ అయింది. బన్నీ.. ప్రస్తుతం పుష్ప సీక్వెల్.. పుష్ప2: ద రూల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఆగష్టులో విడుదల కానుంది. ఈ చిత్ర విడుదల తేదీ మారిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సినిమా యూనిట్ ఖండించింది. చెప్పినట్లుగా.. ఆగష్టు 15నే ఈ సినిమా విడుదలవుతుందని నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్ ప్రకటించింది.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తైన తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రావాలి. కానీ, గుంటూరు కారం సినిమా ఫలితంతో ఈ సినిమా వాయిదా పడినట్లు కనిపిస్తోంది. దీంతో బోయపాటితో సినిమాను బన్నీ ఓకే చేశాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా ఉండొచ్చు.