ALLU ARJUN-SAMANTHA: సమంత ఫేట్ మార్చేందుకు రెడీ అయిన అల్లు అర్జున్
ఇలాంటి టైంలో పుష్ప 2 లో ఐటమ్ సాంగ్‌లో చివరాఖరిన కనిపించే ఛాన్స్, ఆట్లీ మూవీలో అల్లు సరసన హీరోయిన్‌గా ఆఫర్ రావటం నిజంగా అదృష్టమే. సమంత లానే సౌత్‌లో ఆల్‌మోస్ట్ త్రిష కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడుతోందన్న టైంలో 96, పొన్నియన్ సెల్వం, లియో మూవీలతో ఊపిరందినట్టైంది.

ALLU ARJUN-SAMANTHA: సమంత కెరీర్‌కి శుభం కార్డ్ పడే టైంలో అల్లు అర్జున్ ఆదుకునేలా ఉన్నాడు. ఆట్లీ డైరెక్షన్‌లో తను చేయబోయే సినిమాలో సమంత ఆల్‌మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. త్రిష, సమంత.. ఇద్దరిలో బన్నీ మాత్రం తనకి జోడీగా సమంతనే ఎంచుకున్నాడట. ఫ్యాన్స్ కూడా కొన్నిరోజులుగా ఆట్లి మూవీలో బన్నీకి జోడీగా త్రిష, సమంత ఇద్దరిలో ఒకరు ఓకే అయ్యే ఛాన్స్ ఉందని చర్చ జరిగింది. ఫ్యాన్స్ కూడా సమంతకే సై అన్నారు.
FAMILY STAR: ఓ బ్రహ్మోత్సవం.. ఓ ఫ్యామిలీస్టార్.. ఇదేం టార్చర్ కొండన్నా..!
తన అల్లు ఆర్మీ మాటే హీరో విన్నాడేమో అనంటున్నారు. ఏదేమైనా సమంతకి సౌత్‌లో కెరీర్ క్లోజ్ అనే టైంలో బాలీవుడ్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ 2తో కొంత కాలం కలిసొచ్చింది. సిటాడెల్ రీమేక్‌తో ఇంకొంత రిలీఫ్ దక్కుతోంది. ఇలాంటి టైంలో పుష్ప 2 లో ఐటమ్ సాంగ్‌లో చివరాఖరిన కనిపించే ఛాన్స్, ఆట్లీ మూవీలో అల్లు సరసన హీరోయిన్‌గా ఆఫర్ రావటం నిజంగా అదృష్టమే. సమంత లానే సౌత్‌లో ఆల్‌మోస్ట్ త్రిష కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడుతోందన్న టైంలో 96, పొన్నియన్ సెల్వం, లియో మూవీలతో ఊపిరందినట్టైంది. అన్ని హిట్లున్నా టాలీవుడ్‌లో త్రిషకి ఆఫర్లు వచ్చే చాన్స్ లేదు. కాని చిరు మూవీ విశ్వంభరలో హీరోయిన్‌గా మెరిసే ఛాన్స్ అంటే, తనకి మరో ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు అవకాశం దక్కినట్టే.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవరలో బాలీవుడ్ లేడీ శ్రద్ధాకి ఆఫర్ రావటం చూస్తే, యంగ్ టైగర్ కూడా బన్నీలానే ఔట్ డేటెడ్ హీరోయిన్లకు ఆపన్న హస్తం ఇస్తున్నట్టున్నాడు. దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ అయినా, ఐటమ్ సాంగ్ మాత్రం శ్రద్దా కపూర్‌తో ప్లాన్ చేశారట. సాహోతో సౌత్‌లో దూసుకెళ్లలేకపోయిన తనకి, బాలీవుడ్‌లో కెరీర్ దాదాపు క్లోజ్ అయినట్టే. అలాంటి తను దేవరలో ఐటమ్ బాంబులా పేలితే, ఫేటే మారే ఛాన్స్ఉంది.