ALLU ARJUN-RAM CHARAN: చరణ్-అర్జున్.. అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలుకానుందా..?
ఆల్రెడీ గతంలోనే చరణ్-అర్జున్ టైటిల్‌ని రిజిస్టర్ చేసిన అల్లు అరవింద్.. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో సెన్సేషన్‌కి రెడీ అవుతున్నాడు. ఒకప్పుడు ఎవడు మూవీలో ఇద్దురు కలిసి నటించారు. అది పూర్తి స్థాయి మల్టీస్టారర్ కాకున్నా, ఇప్పుడు ఈ ఇద్దరి రేంజ్, ఇమేజ్ పాన్ ఇండియా లెవల్లో పెరిగింది.

ALLU ARJUN-RAM CHARAN: అల్లు అరవింద్ అంటేనే అనుభవం ఉన్న నిర్మాత. మెగా హీరోల కాల్‌షీట్సే కాదు ఎవరి డేట్లైనా క్షణాల్లో పట్టేసేంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న టాప్ ప్రొడ్యూసర్. అలాంటి నిర్మతకి చరణ్-అర్జున్ మూవీ కలగానే మిగిలిపోతోందనుకున్నాడు. కాని ఇప్పుడా కలని నిజం చేసే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ గతంలోనే చరణ్-అర్జున్ టైటిల్‌ని రిజిస్టర్ చేసిన అల్లు అరవింద్.. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో సెన్సేషన్‌కి రెడీ అవుతున్నాడు.
Taapsee Pannu: సీక్రెట్ రివీల్.. వైరల్‌గా తాప్సీ పన్ను పెళ్లి వీడియో
ఒకప్పుడు ఎవడు మూవీలో ఇద్దురు కలిసి నటించారు. అది పూర్తి స్థాయి మల్టీస్టారర్ కాకున్నా, ఇప్పుడు ఈ ఇద్దరి రేంజ్, ఇమేజ్ పాన్ ఇండియా లెవల్లో పెరిగింది. అక్కడే అసలు సమస్య వస్తోంది. పుష్పతో స్టైలిష్ స్టార్ కాస్త పాన్ ఇండియా లెవల్లో ఐకాన్ స్టార్‌గా మారాడు బన్నీ. ఇక త్రిబుల్ ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారాడు చరణ్. పుష్ప 2 వెయ్యికోట్ల సీన్ ఉన్న సినిమానే. త్రిబుల్ ఆర్‌తో ఆల్రెడీ గ్లోబల్ స్టార్‌కి ఆ స్టామినా వచ్చేసింది. అలాంటి ఈ ఇద్దరు మెగా ధీరులు కలిసి నటిస్తే.. అది పాన్ ఇండియా సునామీనే తెస్తుంది. అందుకే బాలీవడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఆల్రెడీ బన్నీ, రామ్ చరణ్‌తో తను చర్చించాడట.
దీంతో అలర్ట్ అయిన అల్లు అరవింద్, 2025లో చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రశాంత్ నీల్‌తో చర్చలు జరిగాయని, రాజమౌళితో ప్లాన్ చేసినా, తను మహేశ్ మూవీతో బిజీ అని తేలింది. ప్రశాంత్ నీల్.. సలార్ 2 తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది.