బన్నీ అరెస్ట్, రొమ్ము విరిచాడు..దమ్ము చూపించారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తనను అరెస్ట్ చేసే దమ్ము లేదని... రొమ్ము విరుచుకుని ఇంట్లో ధీమాగా ఉన్న అల్లు అర్జున్ ధైర్యంపై తెలంగాణా పోలీసులు దిమ్మ తిరిగే దెబ్బ కొట్టారు. మరోసారి ప్రీమియర్ షోకి వెళ్ళాలన్నా... బెనిఫిస్ట్ షో పర్మీషన్ అడగాలన్నా వణికే రేంజ్ లో పోలీసులు వ్యవహరించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తనను అరెస్ట్ చేసే దమ్ము లేదని… రొమ్ము విరుచుకుని ఇంట్లో ధీమాగా ఉన్న అల్లు అర్జున్ ధైర్యంపై తెలంగాణా పోలీసులు దిమ్మ తిరిగే దెబ్బ కొట్టారు. మరోసారి ప్రీమియర్ షోకి వెళ్ళాలన్నా… బెనిఫిస్ట్ షో పర్మీషన్ అడగాలన్నా వణికే రేంజ్ లో పోలీసులు వ్యవహరించారు. బెడ్ రూమ్ వరకు వెళ్లి రేవతి మృతికి నువ్వే కారణం బయటకు రా అంటూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళ మరణం తర్వాత రెండు రోజుల వరకు రియాక్ట్ అవ్వకుండా విక్టరీ ఎంజాయ్ చేసిన ఐకాన్ స్టార్ కు… డే టైం లో స్టార్స్ చూపించారు.
పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే పదా అంటూ ఏం వాదించినా వినకుండా తమ పని తాము చేసారు. దీనితో భాయ్ కి బీపీ 200 టచ్ అయింది. “మీరు అరెస్ట్ చేయండి తప్పు లేదు, నేను సహకరిస్తా… కాని బెడ్ రూమ్ వరకు వచ్చి అరెస్ట్ చేసే అధికారం లేదు అంటూ ఫైర్ అయ్యాడు. ఉన్నపళంగా తమతో రావాలంటే ఎలా?.. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా?.. పోలీసులు తీసుకెళ్లడంలో నాకు అభ్యంతరం లేదు అంటూ పోలీసులపై కోపాన్ని చాలా కూల్ గా ప్రదర్శించాడు. తన భార్య భయంతో నవ్వుతుంటే… ఏం అవ్వదు కంగారు పడొద్దు అంటూ బుగ్గలు నిమురుతూ ధైర్యం చెప్పాడు.
అల్లు అరవింద్ కూడా పోలీస్ వాహనం ఎక్కబోతుంటే… వద్దు డాడీ ఆగండి అంటూ ఆపేసాడు. ఇక సన్నిహితులు వచ్చి హగ్ చేసుకుని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటే… సంతాప సభ కాదు అంటూ నవ్వుతూ సెటైర్లు వేసాడు. పుష్ప సినిమాను కాసేపు తన ఇంటి వద్ద చూపించాడు భాయ్. చక్కగా కాఫీ తాగుతూ… తన అనుచరులతో కబుర్లు చెప్తూ చాలా కూల్ గా తన మార్క్ స్మైల్ తో పోలీసు వాహనం ఎక్కాడు భాయ్. చట్టం అంటే సామాన్యులకు నాకు భయం లేదురా షెకావత్ అన్నట్టు… భాయ్ బిహేవియర్ కనపడింది.
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తున్నారనే విషయం తెలియడంతో అభిమానులు అందరూ అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. అసలు ఏం కంగారు లేదంటూ వాళ్లకు కూడా ధైర్యం చెప్పాడు. అరెస్ట్ చేసిన వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య 70 ఎంఏం థియేటర్ యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తన వరకు పోలీసులు వచ్చే ఛాన్స్ లేదంటూ ధైర్యంగా కాలర్ ఎగరేసిన భాయ్ కు… అందరూ ఒకటే అని క్యూట్ అండ్ స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.