Allu arjun : అల్లు అర్జున్ – అట్లీ మూవీ అనౌన్స్‌మెంట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తున్నాడు. పార్ట్‌ 1కు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2024 | 11:25 AMLast Updated on: Apr 02, 2024 | 11:25 AM

Allu Arjun Atlee Movie Announcement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తున్నాడు. పార్ట్‌ 1కు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగష్టు 15న ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే మూవీ ఏంటనేది పెద్ద చర్చగా మారింది. ఈ ప్రాజెక్ట్ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బన్నీ ఇప్పుడు రూటు మార్చేశాడు. ఈసారి కోలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు అట్లీ తో అల్లు అర్జున్ వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్‌గా మారింది.

కోలీవుడ్ (Kollywood) డైరెక్టర్ అట్లీ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ (Bollywood) లోనూ విపరీతంగా పెరిగిపోయింది. మొన్నటి వరకు సౌత్ వరకే అట్లీ పేరు తెలుసు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. షారుక్‌తో ‘జవాన్‌’ (Jaawan) సినిమా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నాడు అట్లీ. జవాన్ సినిమా సంచలన విజయం సాధించడమే కాదు 1000 కోట్ల వరకు వసూల్ చేసింది. ఈ టైమ్‌లోనే బన్నీ- అట్లీ కాంబోలో మూవీ తెరకెక్కబోతోందంటూ కొద్ది రోజులుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.. ఇప్పటికే వీరిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ జరుగగా దీని అనౌన్స్ మెంట్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రానుందని అంటున్నారు. బన్నీ, అట్లీ కాంబో ప్రాజెక్టును ఓ బడా నిర్మాణ సంస్థ రూపొందించనుందని తెలుస్తోంది.

ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ మూవీ భారీ యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా రూపొందనుండగా ఇందులో త్రిష లేదా సమంత లో ఒకరు హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే.. ఈ మూవీలో హీరోయిన్‌కు సంబంధించి మరో వార్త కూడా హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుందంటూ మరో వార్త కూడా వినిపిస్తోంది. ఇప్పటివరకు బన్నీ, కీర్తి సురేష్ (Keerthy Suresh) కాంబోలో ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. కానీ అట్లీ డైరెక్షన్లో తొలిసారి వీరిద్దరి జంటగా కనిపించనుందంటున్నారు. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటి నెలకొంది.