ALLU ARJUN: కొత్త చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. తగ్గేదే లే..
అక్కడ, ఇక్కడ.. ఎక్కడైనా సరే తగ్గేదే..లే అంటున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు నేషనల్ అవార్డుల్లోనూ అదే ప్రూవ్ చేశాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు. టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరోకు సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు.
ALLU ARJUN: నీయవ్వ తగ్గేదే..లే అని.. ఏ ముహూర్తంలో పుష్ప మూవీకి సుకుమార్ డైలాగ్ రాశాడో కానీ.. బన్నీ కెరీర్ అలానే ఉంది. టాలీవుడ్ టాప్ హీరోగా మాత్రమే పరిమితం అయిన బన్నీ.. ఈ మూవీతో ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అక్కడ, ఇక్కడ.. ఎక్కడైనా సరే తగ్గేదే..లే అంటున్నాడు. ఇప్పుడు నేషనల్ అవార్డుల్లోనూ అదే ప్రూవ్ చేశాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు. టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరోకు సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు అల్లు అర్జున్.
అన్నింటికి కారణం పుష్ప. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు సౌత్ మాత్రమే కాదు.. నార్త్ కూడా ఫిదా అయింది. బన్నీ మ్యానరిజం, డైలాగ్ డెలివరీపై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయ్. ఈ మూవీలో బన్నీ చెప్పిన తగ్గేదే.. లే అన్న డైలాగ్ యావత్ ప్రపంచంలోనే వైరల్ అయింది. సినిమాలోని సాంగ్స్ కూడా వైరల్ అయ్యాయి. తన కెరీర్‌లోనే.. ఈ మూవీలో బన్నీ యాక్టింగ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంతో జాతీయ అవార్డు దక్కించుకున్న బన్నీ.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఒక్క తెలుగు నటుడికి కూడా నేషనల్ అవార్డ్ రాలేదు. తెలుగు సినిమాల్లో నటించిన ఇతర బాషా నటులు కమల్‌హాసన్ లాంటివాళ్లకు వచ్చింది కానీ.. తెలుగు వాళ్లకు మాత్రం రాలేదు. చివరికి మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇంతవరకు ఆ అవార్డు దక్కలేదు. అలాంటి అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
మెగా ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఆ తర్వాత కొద్ది రోజులకే తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. గంగోత్రితో వీడేం హీరో అని అన్న నోళ్లతోనే.. వీడురా హీరో అంటే అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు నేషనల్ లెవల్‌లో టాప్ హీరోగా నిలిచాడు. గంగోత్రితో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బన్నీ కెరీర్‌లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. ఆర్య, బన్నీ సినిమాలతో స్టైలిష్ స్టార్ అని పేరు తెచ్చుకున్న బన్నీ.. పుష్ప ముందు వరకు అదే ట్యాగ్‌తో సినిమాలు చేశాడు. ఐతే పుష్ప మూవీ.. బన్నీ కెరీర్‌ను మార్చేసింది. స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు నేషనల్ అవార్డ్ అందుకొని నిజమైన ఐకాన్ అనిపించుకుంటున్నాడు.