ALLU ARJUN: ఆ విషయంలో బన్నీ కంటే వెనకబడిన ప్రభాస్

ఇమేజ్‌లో, క్రేజ్‌లో ఇండియా నెంబర్ వన్ అనిపించుకున్న ప్రభాస్.. ఒక విషయంలో మాత్రం బన్నీతో పోలిస్తే వెనకబడ్డాడు. తన సలార్ మూవీ ఆడియో రైట్స్ రూ.38 కోట్ల ధరే పలికిందట. దీంతో పోలిస్తే పుష్ప-2 ఆడియో రైట్స్ రూ.65 కోట్లు పలికాయట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 24, 2023 | 07:17 PMLast Updated on: Aug 24, 2023 | 7:17 PM

Allu Arjun Beats Prabhas In This Way Pushpa Audio Rights Sold For Record Price

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప సీక్వెల్ రేంజ్ ఏంటో ఒకే ఒక్క అంశంతో తేలిపోయింది. ఈ సినిమా ఆడియో రైట్స్ రూ.65 కోట్లు పలికాయి. పుష్ప సాంగ్స్ ఏరేంజ్‌లో సెన్సేషన్ హిట్ అయ్యాయో చూసి, ఇక పుష్ప-2 సాంగ్స్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో రూ.65 కోట్లు పెట్టి రైట్స్ తీసేసుకుంది టీ సీరీస్ సంస్థ. బాహుబలిలాంటి హిట్ మూవీలతోనే కాదు.. సాహో లాంటి యావరేజ్ మూవీలతో కూడా పాన్ ఇండియా రేంజ్‌లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న హీరో ప్రభాస్.

ఇమేజ్‌లో, క్రేజ్‌లో ఇండియా నెంబర్ వన్ అనిపించుకున్న ప్రభాస్.. ఒక విషయంలో మాత్రం బన్నీతో పోలిస్తే వెనకబడ్డాడు. తన సలార్ మూవీ ఆడియో రైట్స్ రూ.38 కోట్ల ధరే పలికిందట. దీంతో పోలిస్తే పుష్ప-2 ఆడియో రైట్స్ రూ.65 కోట్లు పలికాయట. అంటే ప్రభాస్ మూవీకంటే ఆల్ మోస్ట్ డబుల్. ప్రభాస్ ఎంత టాప్ హీరో అయినా, పుష్ప ఆడియో ఓ రేంజ్‌లో హిట్ అవటంతో పుష్ప 2 మీద అంచనాలు పెరిగాయి. ఇక సలార్ ఎంత క్రేజీ మూవీ అయినా 3 పాటలే ఉండటంతో ఆడియో రైట్స్ రూ.38 కోట్లకే సేల్ అవ్వాల్సి వచ్చింది.

ఐతే జవాన్ ఆడియో రైట్స్‌ని రూ.40 కోట్లకు కొనేసిన లెక్క ప్రకారం చూస్తే ఫుష్ప 2 ఆడియో రైట్సే అధికం. అంతేకాదు షారుఖ్ జవాన్‌తో పోలిస్తే పుష్ప 2 శాటిలైట్ రైట్స్ ఏకంగా రూ.250 కోట్లని తేలింది. అన్ని భాషల్లో పుష్ప-2 కి అంత మొత్తంలో శాటిలైట్ రైట్స్ అంటే వండరే. ఆడియో రైట్స్ విషయంలో ప్రభాస్, షారుఖ్ ఖాన్‌ను బన్నీ మించిపోయాడనుకోవాల్సి వస్తోంది.