అల్లు అర్జున్ ఉచ్చులో మెగా ఫ్యాన్స్
ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే... అల్లు కుటుంబం కూడా వచ్చేది. మెగా ఫ్యాన్స్ అంటే ఒకటే అనేది అందరి భావన. ఆ కుటుంబంలో ఉన్న 11 మంది హీరోల్లో ఏ హీరో సినిమా వచ్చినా మెగా ఫ్యాన్స్ ఆదరిస్తారు.
ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే… అల్లు కుటుంబం కూడా వచ్చేది. మెగా ఫ్యాన్స్ అంటే ఒకటే అనేది అందరి భావన. ఆ కుటుంబంలో ఉన్న 11 మంది హీరోల్లో ఏ హీరో సినిమా వచ్చినా మెగా ఫ్యాన్స్ ఆదరిస్తారు. అందులో స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ల సినిమాలు అయితే మిస్ అవ్వరు. కాని గత ఆరేళ్లుగా మెగా ఫ్యాన్స్ లో చీలిక వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు అయ్యారు. పవన్ కళ్యాణ్ ది కాస్త భిన్నమైన స్టొరీ గాని… ఇక్కడ మరో బ్రాంచ్ బయటకు రావడమే కాస్త జీర్ణించుకోలేని విషయం. అదే అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ.
పుష్ప సినిమా తర్వాత ఇది కాస్త ఎక్కువైంది. పుష్ప సినిమా ప్రమోషన్ తో బన్నీ ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ సెట్ చేసాడు. క్రికెటర్లతో ప్రమోషన్ చేయించడం అనే ఆలోచన చేసి… ప్రపంచ వ్యాప్తంగా తన సినిమాలపై ఆసక్తి పెరిగేలా చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కూడా దాదాపు అదే బాటలో వెళ్ళాడు. ఇక పుష్ప సినిమాతో బన్నీకి కొత్త ఫ్యాన్స్ కూడా వచ్చేశారు. వాళ్ళు మెగా ఫ్యాన్స్ అయితే కచ్చితంగా కాదు గాని బన్నీ ఫ్యాన్స్. అది అంచనా వేసుకున్న బన్నీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
తెలివిగా చేసారో తెలియక చేసారో తెలియదు గాని… జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసీపీ ఎమ్మెల్యేకి ప్రచారం చేసారు. అది వివాదాస్పదం అయింది… అది కాస్త వింతగా కూడా అనిపించింది జనాలకు. పాకిస్తాన్ తో యుద్ధం వస్తే… మన ప్రభుత్వం అంటే కోపం కాబట్టి పాకిస్తాన్ కు సపోర్ట్ చేసినట్టు ఉందనేది మెగా ఫ్యాన్స్ ఆవేదన. ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి బన్నీకి మధ్య గ్యాప్ పెరిగింది. పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా పై పరోక్షంగా కామెంట్స్ చేసారు. ఇటీవల అల్లు అర్జున్ బహిరంగంగానే తాన ఆర్మీ అంటూ కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.
ఇక్కడి నుంచి మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. బన్నీని టార్గెట్ చేసి తిట్టడం మొదలుపెట్టారు. ఇవన్నీ చూస్తుంటే జనాలకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. బన్నీ కావాలనే ఆ కామెంట్స్ చేసాడని, దాని ద్వారా సింపతీ పెంచుకునే ప్రయత్నం చేసాడనే అనుమానం కలుగుతోంది. పుష్ప 2 సినిమాను ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తున్నారనే సంకేతాలు ఇచ్చాడు. దీనితో ఆ సినిమాకు కూడా క్రేజ్ పెంచవచ్చు, తనపై సింపతీ పెరిగితే ఫ్యాన్స్ పెరుగుతారని లెక్కలు వేసుకుంటున్నాడు అంటున్నారు జనాలు. బన్నీ ట్రాప్ లో మెగా ఫ్యాన్స్ పడి తిడుతున్నారని, చివరికి ఎమ్మెల్యే కూడా ఆ ఉచ్చులో పడ్డారని కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ విషయంలో బన్నీ ప్లాన్ వర్కౌట్ అయితే… అల్లు అర్జున్ ఆర్మీ మాత్రమే ఉంటుంది తన వెనుక. మెగా ఫ్యామిలీ నీడ అనే మాట నుంచి అతను బయటకు వచ్చినట్టే. మరి బన్నీ ఏ విధంగా అడుగులు వేస్తాడో చూడాలి.