మెగా ఫ్యామిలీతో ఉన్న విభేదం అదే, పవన్‌కు ఎందుకు సపోర్ట్‌ చేయలేదంటే

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. కేవలం పుష్ప సినిమా వల్లే కాకుండా మెగా కుటుంబంలో ఉన్న వివాదాల నేపథ్యంలో కూడా చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డికి మద్దతు తెలిపినప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 11, 2024 | 04:00 PMLast Updated on: Nov 11, 2024 | 4:00 PM

Allu Arjun Clarity About Issue With Pawan Kalyan

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. కేవలం పుష్ప సినిమా వల్లే కాకుండా మెగా కుటుంబంలో ఉన్న వివాదాల నేపథ్యంలో కూడా చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డికి మద్దతు తెలిపినప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. చాలా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో అల్లు అర్జున్‌ కనిపించకపోవడంతో ఇక మెగా ఫ్యామిలీ బన్నీని దూరం పెట్టేసిందని కూడా చాలా మంది కన్ఫాం చేసేశారు. ఇలాంటి నేపథ్యంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షోకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా టీం రిలీజ్‌ చేసింది. బాలయ్య గురిచి తెలిసిందేగా.. ముందు వెనకా ఆలోచించకుండా.. ఎవరేమనుకుంటారోనని ఆలోచించకుండా అడగాల్సి వివాదాస్పద ప్రశ్నలన్నీ అడిగేస్తుంటాడు.

దీంతో మెగా ఫ్యామిలీ గురించి వాళ్ల కుటుంబంలో ఉన్న వివాదాల గురించి బాలయ్య బన్నీని ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇలాంటి స్టఫ్‌ ఎపిసోడ్‌లో ఉందని ప్రోమోలు హింట్‌ కూడా ఇచ్చేశారు. చిరంజీవిని అల్లు అర్జున్‌ ముద్దు పెట్టుకున్న ఫొటో పెట్టి ఇది ఆ ఫొటో గురించి బన్నీని అడిగాడు బాలయ్య. రీసెంట్‌గా కొన్ని ఈవెంట్స్‌లో బన్నీ చేసిన కామెంట్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి. మెగా ఫ్యామిలీ అండ లేకుండానే బన్నీ స్టార్‌ హీరో అయ్యాడా అంటూ చాలా మంది బన్నీని విమర్శించారు. ఒక హోదా వచ్చాకి చిరంజీవిని బన్నీ తక్కువ చేస్తున్నాడంటూ చాలా మంది పోస్టులు పెట్టారు. ఇక జనసేన విషయంలో బన్నీని తిట్టని లీడర్‌ లేడు. ఇంటర్నెట్‌లో కూడా బన్నీ మీద చాలా ట్రోల్స్‌ మొదలయ్యాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పవన్‌ గురించి, తాను వైసీపీ నేతకు చేసిన ప్రచారం గురించి బన్నీ ఏం చెప్పబోతున్నాడు అనే విషయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక జానీ మాస్టర్‌ వ్యహారం గురించి కూడా బాలయ్య బన్నీని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అమ్మాయిలకు ఏ అన్యాయం జరిగినా తాను చాలా ఫీలవుతునాటంనూ బన్నీ చెప్పాడు. రీసెంట్‌గా జానీ మాస్టర్‌ వ్యవహారంలో బాధితురాలికి అండగా ఉంటానంటూ గీతా ఆర్ట్స్‌ హామీ ఇచ్చింది. దీంతో జానీ వ్యవహారంలో కూడా అల్లు అర్జున్‌ ఈ ఎపిసోడ్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది.