Allu Arjun: థ్రెడ్స్ యాప్‌లో బన్నీ ఆల్‌టైమ్ రికార్డ్
బన్నీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనోడి స్టైల్‌కు యూత్ అంతా ఫిదా. సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ప్రతీ కుర్రోడు.. బన్నీని ఫాలో అయిపోతుంటాడు.
దాదాపుగా ! పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన బన్నీ క్రేజ్ మరింత పెరిగింది. వేదిక ఏదైనా సరే.. తగ్గేదే లే అన్నట్లుగా బన్నీకి ఫాలోయింగ్ ఉంటుంది. కొత్తగా వచ్చిన సోషల్ మీడియా యాప్ థ్రెడ్‌లోనూ.. బన్నీ సత్తా చూపించాడు. ట్విటర్‌కు పోటీగా మెటా నుంచి వచ్చిన థ్రెడ్స్ యాప్‌లో ఏ ఇండియన్ యాక్టర్‌కు సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేశాడు బన్నీ.
థ్రెడ్స్ యాప్‌లో అల్లు అర్జున్ ఫాలోవర్ల సంఖ్య 10లక్షలు దాటింది. థ్రెడ్స్‌లో మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యువతను అట్రాక్ట్ చేసే యాప్స్ కలిగి ఉన్న మెటా నుంచి ఈ థ్రెడ్స్ రావడంతో.. ఈ యాప్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కోట్ల మంది యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. యాప్ రిలీజైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 3కోట్ల డౌన్‌లోడ్స్ జరగగా.. అందులో 22 శాతం కేవలం ఇండియా నుంచే కావడం విశేషం.
థ్రెడ్స్ యాప్‌లో అల్లు అర్జున్ అకౌంట్.. అల్లు అర్జున్ ఆన్‌లైన్ పేరుతో ఉంది. అల్లు అర్జున్ ఈ రికార్డు అందుకోవడంతో వేదిక ఏదైనా సరే అసలు తగ్గేదేలే అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థ్రెడ్స్ యాప్‌లోకి ముందుగా ఎన్టీఆర్ అడుగు పెట్టాడు. ఐతే వన్ మిలియన్ మార్క్ ను మాత్రం బన్నీ సొంతం చేసుకున్నాడు. ఇది చాలు బన్నీ క్రేజ్ ఏంటో చెప్పడానికి అని అతని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2లో యాక్ట్ చేస్తుండగా.. సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయ్.