ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ కాదు.. బన్నీ అంటూ ఎటాక్…

రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరే ఇప్పుడు పాన్ ఇండియా కింగ్స్ అంటే.. కాకపోతే ఎన్టీఆర్ కంటేముందే అల్లు అర్జున్ పాన్ ఇండియా కింగ్ అనేది అల్లు అర్మీ వాదన.. పుష్ప 2 ట్రైలర్ వచ్చాక, దానికి మిలియన్ల కొద్ద వ్యూవ్స్ సొంతమయ్యాక, అల్లు ఆర్మీకి పూనకాలొచ్చాయి..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2024 | 12:12 PMLast Updated on: Nov 20, 2024 | 1:21 PM

Allu Arjun Domination Starts In Tollywood

రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరే ఇప్పుడు పాన్ ఇండియా కింగ్స్ అంటే.. కాకపోతే ఎన్టీఆర్ కంటేముందే అల్లు అర్జున్ పాన్ ఇండియా కింగ్ అనేది అల్లు అర్మీ వాదన.. పుష్ప 2 ట్రైలర్ వచ్చాక, దానికి మిలియన్ల కొద్ద వ్యూవ్స్ సొంతమయ్యాక, అల్లు ఆర్మీకి పూనకాలొచ్చాయి.. అంతే రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియ నెం.1 అయితే పాన్ ఇండియా నెం.2 కింగ్ ఐకాన్ స్టారే అన్నట్టు సోషల్ మీడియాలో పెద్ద సునామీ మొదలైంది. కాని విచిత్రం ఏంటంటే పాన్ఇండియా లెవల్లో ఒక సారి కాదు, కనీసం రెండు మూడు సార్లు హిట్ మెట్లెక్కితే కాని రెబల్ స్టార్ కి పాన్ ఇండియా కింగ్ టైటిల్ దక్కలేదు. ఆవిషయంలో రెండు పాన్ ఇండియా హిట్లు పడ్డాయి కాబట్టి, సెకండ్ పాన్ ఇండియా కింగ్ ఎన్టీఆరే అంటున్నారు. అక్కడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద అల్లు ఆర్మీ ఎటాక్ పెరిగింది… ఇంతకి ఈ గొడవ ఎక్కడికి వెళుతుంది?

పాన్ ఇండియా కింగ్ అంటే రెబల్ స్టారే..అందులో ఎలాంటి డౌట్ లేదు. బాహుబలి, బాహుబలి 2, సాహో, సలార్, కల్కీ లాంటి బ్లాక్ బస్టర్లు, రెండు సార్లు 1000 కోట్ల వసూళ్ల రికార్డు సొంతం చేసుకున్న హీరోగా రెబల్ స్టార్ ఎప్పుడో పాన్ ఇండియా కింగ్ అయ్యాడు. తన తర్వాత ప్లేస్ లో ఆల్ మోస్ట్ రెబల్ స్టార్ రేంజ్ లోనే కింగ్ అనిపించుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

కారణం ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లెవల్లో రెండోసారి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సౌత్ స్టార్ అంటే ఎన్టీఆర్ ఒక్కడే. త్రిబుల్ ఆర్, దేవర రెండూ పాన్ ఇండియా లెవల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే ఏంటో అందరికి అర్ధమయ్యేలా చేశాయి. కాని ఈ విషయంలో పాన్ ఇండియా సెకండ్ కింగ్ అంటే ఐకాన్ స్టారే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్

దానికి వాల్లు చెప్పే రీజన్ ఒక్కటే… ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాని షేక్ చేసిన మరో స్టార్ అంటే అల్లు అర్జునే అనేది వాళ్ల అభిప్రాయం. బాహుబలి, బాహుబలి 2, సాహో ఇలా ప్రభాస్ పాన్ ఇండియాని షేక్ చేస్తున్నటైంలో పుష్పతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు అల్లు అర్జున్. ప్రమోషన్ లేకుండానే పాన్ ఇండియా లెవల్లో సుకుమార్ చేసిన ప్రయోగం హిట్ మెట్టెక్కింది.

కాబట్టి రెబల్ స్టార్ తర్వాత ఆరేంజ్ లోపాన్ ఇండియా కింగ్ అంటే బన్నీనే అనంటున్నారు. కాని ఇక్కడ రియాలిటీ చెక్చేస్తే, బాహుబలి తర్వాత పాన్ ఇండియాని షేక్ చేసిన మరో సౌత్ స్టార్ అంటే కేజీయఫ్ ఫేం యశ్. బాహుబలి2 తర్వాత కేజీయఫ్ మూవీనే 1200 కోట్ల వసూళ్లతో ట్రెండ్ సెట్ చేసింది. అంతేకాదు, కేజీయఫ్, కేజీయప్ 2 ఇలా రెండు సార్లు బ్లాక్స్టర్లతో పాన్ ఇండియాని షేక్ చేశాడు… అలా చూసినా పుష్ప తర్వాత పుష్ప2 తో వస్తున్న బన్నీకంటే కేజీయఫ్ఫే ముందున్నట్టు

కాని ఒకవిషయంలో ఎన్టీఆర్ ని దాటలేకపోయాడు యష్.. ఎందుకంటే ప్రశాంత్ నీల్ మేకింగ్ లోనే కేజీయఫ్, కేజీయఫ్ 2 తో పాన్ ఇండియాని షేక్ చేసిన యష్, మరో దర్శకుడి మేకింగ్ లో పాన్ ఇండియా హిట్ పడితే అప్పుడు ఎన్టీఆర్ లా దూసుకెళ్లిన స్టార్ అయ్యేవాడు.ఎందుకంటే రాజమౌలి సపోర్ట్ లేకుండా, అంతా తానై దేవర తో హిట్ మెట్టెక్కడమే కాదు, రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయగలిగాడు..

ఇలా అన్ని విధాలా పాన్ ఇండియా లెవల్లో తనని తాను ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్ తోపోలిస్తే యశ్, బన్నీ ఎక్కడో ఉన్నారు.. కాని బన్నీ ఫ్యాన్స్ మాత్రం ప్రబాస్ తర్వాత పాన్ ఇండియా కింగ్ అంటే పుష్పరాజే అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టడంతోనే రచ్చమొదలైంది.