Allu Arjun: 20 ఏళ్ల క్రితం వేస్ట్ ఫెలౌ అన్నారు..మరి ఇప్పుడో
అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి చిత్రం 'గంగోత్రి' రిలీజై 20 ఏళ్లయింది. 2003 మార్చి 28న గంగోత్రి రిలీజ్ కాగా..తనను ఇంతవాడిని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపూ పోస్ట్ పెట్టాడు బన్నీ. అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపైకి అడుగుపెట్టాడు. విజేత.. స్వాతిముత్యం.. డాడీ వంటి మూడు సినిమాల్లో నటించి గంగోత్రితో హీరోగా పరిచయమయ్యాడు. సినిమా రిలీజైంది.. హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. బన్నీ బాగానే చేశాడన్నారేగానీ.. హీరోలా అనిపించలేదన్న విమర్శలే ఎక్కువ వినిపించాయి. 50..50 లా ఉన్నదంటూ వెక్కిరింతలు కూడా వినిపించాయి.
గంగోత్రి రిలీజ్ తర్వాత తన లుక్‌పై వచ్చిన విమర్శలకు ఆర్యతో గట్టిగా బదులిచ్చాడు. యంగ్ హీరో అంటే ఇలాగే వుండాలనేలా.. మారిపోయాడు. ఇక ఆర్య2తో అయితే.. యూత్ ఐకాన్‌గా ఇంప్రెస్ చేశాడు. ఇలా తనని తాను మార్చుకుని మొదట్నుంచీ సర్‌ప్రైజ్‌చేస్తూనే వున్నాడు బన్నీ. పుష్పతో ఒకేసారి ఊరమాస్‌గా మేకోవర్ అయిన బన్నీకి ఇలా మారడం ఆర్య నుంచి అలవాటే. అల్లు అర్జున్‌లోని మాస్ హీరోను పూరీ జగన్నాథ్ దేశముదురుతో బైటకు తీసుకొస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేశాడు. జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి.. అల వైకుంఠపురంలోను ఫ్యామిలీ ఆడియన్స్ సూపర్‌హిట్ చేశారు.
ఇక అల్లు అర్జున్ కెరీర్‌ను పూర్తిగా మర్చేసిన సినిమా పుష్ప. ఆర్యతో సుకుమార్ బన్నీని స్టైలిష్‌గా చూపిస్తే.. పుష్పతో రగ్డ్‌గా చూపించాడు. హీరోలో వున్న పెర్‌ఫార్మర్‌ను బ్లోఔట్ చేసి.. పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చాడు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. 100 కోట్లు తీసుకుంటున్న హీరోల లిస్టులో చేరాడు. పుష్ప2 కోసం..తెలుగువాళ్లే వారు.. ఇండియన్ మూవీ ఎదురుచూసే స్థాయికి ఎదిగాడు. డెబ్యూ మూవీ గంగోత్రి రిలీజై 20 ఏళ్లయిన సందర్భంగా అల్లు అర్జున్ పోస్ట్ చేస్తూ.. నాపై చూపించిన ప్రేమ చూస్తే నేనెంతో అదృష్టవంతుడిని. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ప్రేక్షకులు, అభిమానుల ప్రేమే కారణం. మీకెప్పటికీ కృతజ్ఞతలతో వుంటానన్నాడు. అల్లు అర్జున్ చూస్తే అర్థం అవుతుంది. హార్డ్ వర్క్..పట్టుదల తో ఎంత ఎత్తుకు ఎదగ వచ్చో నిరూపించాడు బన్నీ.