Allu Arjun: క్లీంకారకు బన్నీ సూపర్ గిఫ్ట్.. ఇది కదా ప్రేమంటే
క్లీన్‌కార రాకతో.. మెగా ఫ్యామిలీలో సంబరాలు మాములుగా లేవ్. దాదాపు పదేళ్ల తర్వాత పుట్టిన బిడ్డ కావడంతో.. మెగా ప్రిన్సెస్‌ను అపురూపంగా చూసుకుంటున్నారు అంతా !

Allu Arjun gifted a gold plate for Ram Charan's daughter Klinkara
బారసాల వేడుక నభూతో అనే రేంజ్‌లో జరిపించారు. చెర్రీ కూతురికి టాలీవుడ్ స్టార్స్‌లో చాలామంది మంచి మంచి గిఫ్ట్‌లు పంపించారు. ఎన్టీఆర్ అయితే.. స్పెషల్‌గా గోల్డ్ కాయిన్స్ డిజైన్ చేయించి.. బహుమతులుగా పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కోడలి కోసం అల్లు అర్జున్.. అలాంటి భారీ గిఫ్టే ఇచ్చాడట. క్లీంకారకు ఓ విలువైన కానుకను అందించినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. క్లీన్‌కారా కోసం బంగారు పలకను బన్నీ బహుమతిగా ఇచ్చారట. నెల రోజుల బేబీకి పలక ఎందుకు అని అవాక్కవుతున్నారేమో.. పలక అంటే రాసుకునేది కాదు.. క్లీంకార పేరు, ఆమె పుట్టిన వివరాలు వచ్చేలా పలకపై బంగారు అక్షరాలు వచ్చేలా డిజైన్ చేయించారట.
ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఐకాన్ స్టార్ ఐడియా కొత్తగా ఉందని మురిసిపోతున్నారు. ఈ మధ్య రాంచరణ్‌కు, బన్నీకి మధ్య దూరం పెరిగిందని తెగ చర్చ జరిగింది. రాంచరణ్ బర్త్‌డేకు సోషల్ మీడియాలో కనీసం విషెస్ చెప్పని బన్నీ.. ఆ తర్వాత పార్టీకి కూడా రాలేదు. దీంతో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి దూరం పెరిగిందని ప్రచారం జరిగింది. ఐతే ఈ మధ్య బేబీ సక్సెస్ వేడుకలో పాల్గొన్న బన్నీ.. కట్టె కాలే వరకు చిరంజీవి కోసమే అనే ఒక్క మాటతో.. తమ మధ్య ఎలాంటి దూరాలు లేవని చెప్పకనే చెప్పేశాడు. ఇప్పుడు బావ రాంచరణ్ కూతురు కోసం బంగారు పలక పంపించి.. విభేదాలు అనే ప్రచారాన్ని ఒక్క బహుమతితో క్లియర్ చేసేశాడు బన్నీ.