Director Surendar Reddy: దిక్కులేని దర్శకుడికి.. అల్లు అర్జునే దిక్కయ్యాడు..
సురేందర్ రెడ్డి పెద్ద తప్పు చేశాడు. పదికోట్ల మార్కెట్ లేని అఖిత్ తో 30కోట్ల బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేసి తప్పుచేసిన తను, బడ్జెట్ ని 80 కోట్లకు పెంచి ఆ తప్పు సైజుని కూడా పెంచేశాడు. అలా ఒకే ఒక్క ప్లాప్ పడి, అది డిజాస్టరని తేలటంతో సురేందర్ రెడ్డి కాల్స్ కూడా ఏ హీరో ఎత్తట్లేదట.
కాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు చాలా టైం పడుతుంది. కాబట్టి పుష్ప 2 పూర్తి కాగానే సురేందర్ రెడ్డిని ప్రాజెక్ట్ పట్టాలెక్కించమన్నాడట. ఇలా సూరీని బన్నీ కాపాడుతుంటే, పూరీని ఉస్తాద్ రామ్ ఆదుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య ఇద్దరూ పూరీకి నోచెప్పారు. అందులో వాళ్ల తప్పు కంటే కథ చెప్పని పూరీ తప్పే ఎక్కువుందనే కామెంట్స్ ఉన్నాయి.
అసలు పూరీ పరిస్థితేలా ఉందంటే, విశ్వక్ సేన్ లాంటి హీరోలు కూడా పూరీ ఫోన్ కాల్ ఎత్తట్లేదట. అలాంటి టైంలో ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడని, కృతజ్ఞతతో పూరీకి రామ్ సైఅన్నాడు. ఆల్రెడీ ఆచార్య ఫ్లాప్ తో డీలా పడ్డ కొరటాల శివకి ప్రాజెక్ట్ 30 తో ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడు. ఎలాంటి టాప్ డైరెక్టర్లు ఎలా అయిపోయారు.. వీళ్ల చేతిలో పడితే హీరోల ఫేటే మారుతుందనేంత సీన్ ఉన్న వీళ్లకి, హీరోలు ఆఫర్లిస్తే తప్ప ఫ్యూచర్ లేని పరిస్థితొచ్చింది.. అంతా స్వయం కృతాపరాదమే.