అల్లు అర్జున్ కు నా శాపం తగిలింది, అందుకే అరెస్ట్ అయ్యాడు, వేణు స్వామి సంచలనం

సినిమా పరిశ్రమ, రాజకీయాలు, వ్యాపారాలు, వ్యక్తిగత జీవితాలు... ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వీటిలో ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టే ఛాన్స్ ఉండదు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ కుదిరితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తనకు నచ్చిన విధంగా జ్యోతిష్యం చెప్పడం కామెంట్ చేయడం అనేది ఈయన స్టైల్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2024 | 09:49 PMLast Updated on: Dec 20, 2024 | 9:49 PM

Allu Arjun Got My Curse Thats Why He Was Arrested Venu Swamy Is A Sensation

సినిమా పరిశ్రమ, రాజకీయాలు, వ్యాపారాలు, వ్యక్తిగత జీవితాలు… ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వీటిలో ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టే ఛాన్స్ ఉండదు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ కుదిరితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తనకు నచ్చిన విధంగా జ్యోతిష్యం చెప్పడం కామెంట్ చేయడం అనేది ఈయన స్టైల్. ఎవరు హర్ట్ అయినా ఎవరు నాశనం అయిపోయినా… ఎవరు కుమిలిపోయిన, ఎవరు చచ్చిపోయినా ఆయనకు అనవసరం అన్నట్లుగానే ఆయన జ్యోతిష్యం ఉంటుంది.

సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వేలు పెట్టి వాసన చూసి వాళ్ళు అడగకపోయినా వాళ్ళ జ్యోతిష్యం చెప్పి తర్వాత వాళ్ళు సీరియస్ అయితే నా మీద సీరియస్ అయ్యారు అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అవ్వటం ఈయన స్టైల్. చాలా మంది జ్యోతిష్యులు సమాజానికి తెలుసు కానీ ఈ రేంజ్ లో ఏ జ్యోతిష్యుడు సమాజంలో పాపులర్ కాలేదు. ఇక మందు, ముక్కతో దేవుడికి పూజ చేస్తాను అంటూ వింత వాదనలు చేసే వేణు స్వామి ఇప్పుడు రివేంజ్ మోడ్ లో ఉన్నట్టు కనపడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తీవ్రస్థాయిలో చర్చలకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది.

అయితే వేణు స్వామి వాదన ప్రకారం అల్లు అర్జున్ అరెస్టు అనేది కచ్చితంగా తన శాపమని… తనపై సినిమా పరిశ్రమ విమర్శలు చేసినందుకే చిక్కుల్లో పడింది అంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు వేణు స్వామి. తనను గెలికినప్పటి నుంచే సినిమా పరిశ్రమకు ఈ పరిస్థితి ఉందని… పాన్ ఇండియా హీరోను జైల్లో పెట్టడం, 70 ఏళ్ల చరిత్ర ఉన్న నటుడి ఇంట్లో గొడవలు ఇవన్నీ ఎప్పుడైనా చూశారా…? నేను ఎప్పుడో ఆగస్టులోనే ఇదంతా చెప్పా ఇంకా చాలా చాలా జరుగుతాయని వేణు స్వామి కామెంట్ చేశాడు.

ఇక అల్లు అర్జున్ సీఎం అవుతాడు అంటూ కూడా వేణు స్వామి జ్యోతిష్యం చెప్పడం ఓ సెన్సేషన్. ఇక 2025 మార్చి నుంచి రాజకీయాల్లో పెద్ద సంచలనాలు కూడా జరగనున్నాయని వేణు స్వామి ఇప్పటికే చెప్పుకొచ్చాడు. రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు ఉంటాయని వేణు స్వామి కామెంట్ చేశాడు. ఇక మనం వేణు స్వామిని గెలికినప్పటినుంచి ఎందుకు సినిమా పరిశ్రమంలో కలకలం మొదలైంది అనేది ఆలోచించుకోవాలి అంటూ సినిమా పెద్దలకు ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య విడిపోతారు అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం అయ్యాయి. కోర్టు వరకు కూడా వెళ్ళింది. అటు హైకోర్టు కూడా వేణు స్వామి విషయంలో సీరియస్ గానే కామెంట్స్ చేసింది. మరి ఆయన శాపం తగిలిందో లేదో కానీ ఆయన మాత్రం ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.