ఎన్టీఆర్ ని చూసి కాల్చుకున్నాడు.. 1800 కోట్ల వాతలు…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లానే రెండు పాన్ ఇండియా హిట్లున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. నిజానికి దేవరకంటే పుష్ప2 కే భారీగా వసూళ్లొచ్చాయన్నారు. అయినా ఎందుకో తారక్ మీదే తన కన్నున్నట్టుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2025 | 01:38 PMLast Updated on: Apr 14, 2025 | 1:38 PM

Allu Arjun Got Shocked

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లానే రెండు పాన్ ఇండియా హిట్లున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. నిజానికి దేవరకంటే పుష్ప2 కే భారీగా వసూళ్లొచ్చాయన్నారు. అయినా ఎందుకో తారక్ మీదే తన కన్నున్నట్టుంది. మొన్న తన దర్శకులకోసం ట్రై చేశాడు. తర్వాత జాన్వీ కపూర్ డేట్లకోసం డైరెక్టర్ ని పంపాడు.కట్ చేస్తే ఇప్పుడు ప్రియాంక చోప్రా కోసం రాయభారం పంపాడు.. అన్నీంటీకి అన్నీ బెడిసి కొట్టాయి. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి నుంచి, జాన్వీ కపూర్, ఆలియా అండ్ కో వరకు అంతా తనని లైట్ తీసుకోవటం షాకింగ్ గా మారింది. నిన్నమొన్నటి వరకు తన నెక్ట్స్ పాన్ ఇండియా మూవీకి దర్శకుల కరువొచ్చిందంటే, ఇప్పుడు హీరోయిన్లు కూడా బన్నీని రిజెక్ట్ చేస్తున్నారు. చాలా విషయాల్లో ఎన్టీఆర్ దారిలోనే నడుస్తున్న బన్నీకి, మ్యాన్ ఆఫ్ మాసెస్ స్ట్రాటజీ బెడిసికొడుతోంది. హీరోయిన్లే కాదు, డజన్ కి పైనే పంచ్ లు పడటంతో, తన మీద కామెంట్ల కామెడీ భారీగా జరుగుతోంది..

పులిని చూసి వాతలు పెట్టుకుంటే వాచిపోతుంది కాని, ఫలితం ఉండదు.. అచ్చంగా మరొకరిని ఇమిటేట్ చేసినా, మరొకరి స్ట్రాటజీని ఫాలో అయినా కొన్ని సార్లు ఫలితం రాకపోగా, రిజల్ట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ ని చూసి తన దారిలో నడవబోయిన బన్నీకి ఒకటికాదు, రెండు కాదు డజన్ కి పైనే పంచులు పడ్డాయి. పడుతున్నాయి. కొత్తగా హీరోయిన్ విషయంలో కూడా ఇలానే షాక్ కొట్టింది

ఎన్టీఆర్ తో జోడీకట్టిన జాన్వీ కపూర్ ని ఆట్లీ మూవీకోసం బన్నీ టీం, ట్రై చేసిందట. కాని తాను కుదరదనేసినట్టు తెలుస్తోంది. బేసిగ్గా ఇలాంటివన్నీ దర్శక నిర్మాతలు చూసుకుంటారు. కాని బన్నీ మాత్రం దేవర బ్యూటీని తన సినిమాకు తీసుకోవాలని, తన టీంనే రంగంలోకి దింపాడట. అదే బెడిసి కొట్టింది.

ఇక హాలీవుడ్ లో సెటిలైన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రాని ఆట్లీ మూవీకోసం ట్రై చేశారని తెలుస్తోంది. కాని తను ఆల్రెడీ సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీకి కిమటవ్వటంతో నో చెప్పేసింది. సరే డేట్లు లేక నో చెప్పిందనుకుంటే, మరి హ్రితిక్ రోషన్ మూవీ క్రిష్ 4 కి ఎందుకు డేట్లు ఇచ్చినట్టు… సో పుష్ప రాజ్ గా రెండు సార్లు పాన్ఇండియాని షేక్ చేసినా కూడా, బన్నీతో జోడీకట్టేందుకు ప్రియాంక చోప్రానే కాదు, జాన్వీ కపూర్ లాంటి జూనియర్లు కూడా సిద్దంగా లేరా..?

అసలే పాన్ ఇండియా హిట్లు పడ్డాక మరో పాన్ ఇండియా మూవీ చేసేందుకు, డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్ ని కలిశాడు. కాని తను డ్రాగన్ తో పాటు సలార్ 2 కూడాతీయాలి కాబట్టి నోచెప్పాడట. ఎలాగూ కేజీయఫ్ 3 కూడా ప్లానింగ్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది కాబట్టితనతో కాంబినేషన్ కుదర్లేదు. దేవర2 ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే కొరటాల శివతో సెట్ కాలేదు.

అందుకే వద్దనుకున్ ఆట్లీ తోనే అడ్జెస్ట్ అయ్యి సన్ ప్రొడక్షన్ లో సినిమాచేయబోతున్నాడు బన్నీ. అసలే పుష్ప2 హిట్టైనా సంధ్యా థియేటర్స్ ఇన్స్ డెంట్ తో వచ్చిన పేరు కాస్త పోయిందన్నారు. తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్లే కాదు, బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి కూడా బన్నీని లైట్ తీసుకున్నాడు. అది కూడా మూడు సార్లు ఇంటికెల్లి కలిసినా ప్రయోజనం లేకుండాపోయింది.

తను రణ్ బీర్ కపూర్, ఆలియా, విక్కీ కౌశల్ తో లవ్ అండ్ వార్ మూవీ ని మొదలుపెట్టేశాడు. ఇలా చూస్తే దర్శకులు, హీరోయిన్లు ఇలా అంతా బన్నీ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకో ఎన్టీఆర్, దారిలో దర్శకులు, జోనర్లు, హీరోయిన్లను సెలెక్ట్ చేస్తే చరణ్ కి హీరోయిన్లు, డైరెక్టర్ల డేట్లు దొరుకుతున్నాయి. కాని బన్నీకి రిజెక్షన్లే ఎదురౌతున్నాయి.