Allu Arjun: మహేశ్ వదిలించుకున్నాడు.. బన్నీ వదిలించుకోలేకపోతున్నాడు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు వదిలేసిందే, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకుంటున్నాడట. అదే త్రివిక్రమ్ రాసిన కథ. గుంటూరు కారం మూవీ కి ముందే త్రివిక్రమ్ అయోద్యలో అర్జునుడు అంటూ కథ రాశాడు. ఆ స్టోరీ మహేశ్ కి నచ్చకపోవటంతో, మరో కథతో గుంటూరు కారం తీస్తున్నాడు.

Mahesh Rejected Story do by Allu Arjun
విచిత్రం ఏంటేంటే మహేశ్ రిజెక్ట్ చేసిన అయోధ్యలో అర్జునుడు కథ, నిజానికి ఎన్టీఆర్ కూడా గతంలో రిజెక్ట్ చేశాడు. అప్పుడు టైటిల్ అయిననూ పోయిరావలే హస్తినకు అనుకున్నారు. కాని అది పట్టాలెక్కలేదు. అక్కడి నుంచి మహేశ్ కి వెళ్లిన కథకి టైటిల్ మారింది. తర్వాత సూపర్ స్టార్ నో చెప్పటంతో కథే మారిపోయింది.
ఇప్పుడు బన్నీతో త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేశాడు. ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక ఏ కథ అంటే ఎన్టీఆర్, మహేశ్ బాబు నో చెప్పిన కథనే బన్నీతో త్రివిక్రమ్ తీస్తున్నాడని తెలుస్తోంది. పొలిటికల్ టచ్ ఉన్న మాస్ ఫ్యామిలీ డ్రామా జోనర్ లోఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. గతంలో పుష్ప కథని మహేశ్ కి చెబితే తను నో చెప్పటం, బన్నీతో ఆ సినిమా ను తీసేయటం జరిగింది. అలా సూపర్ స్టార్ నో చెప్పిన కథ బన్నీ ఫేటే మార్చింది. అందుకే మళ్లీ మహేశ్ నో చెప్పిన కథే బన్నీచేయబోతున్నాడు కాబట్టి ఇది మరో పుష్ప అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.