Jawan: జవాన్ హిట్‌తో కంగారు పడుతున్న అల్లు అర్జున్‌..?

ముందుగా ఈ సినిమా హిట్ అవ్వాలని బన్నీ కోరుకోవటానికి కారణం ఒకటే.. జవాన్ దర్శకుడు అట్లీతో బన్నీ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. జవాన్ హిట్టైతే పాన్ ఇండియా లెవల్లో అట్లీకి పేరొస్తుంది. తనతో మూవీ చేస్తే తనకి కలిసొస్తుందనేది బన్నీ లెక్క.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 8, 2023 | 05:56 PMLast Updated on: Sep 08, 2023 | 5:56 PM

Allu Arjun In Dilemma About Movie With Atlee Kumar After Jawan Success

Jawan: జవాన్ ఓపెనింగ్స్ రూ.120 కోట్లు దాటాయి. కేవలం ఇండియాలోని అన్ని భాషల్లో రూ.70 కోట్లు రావటం హాట్ టాపిక్ అయ్యింది. తమిళ దర్శకుడు అట్లీ దశ తిరిగింది. అంతా బానే ఉంది కాని ఐకాన్ స్టార్ అ్లలు అర్జున్‌కు జవాన్ హిట్ రుచించట్లేదట. తన అభిమాన హీరో జవాన్ హిట్ అవ్వాలని బన్నీ కోరుకున్నాడు. అలానే జరిగింది. కాని అల్లు అర్జున్‌కి ఇది మాత్రం నచ్చట్లేదు. ముందుగా ఈ సినిమా హిట్ అవ్వాలని బన్నీ కోరుకోవటానికి కారణం ఒకటే.. జవాన్ దర్శకుడు అట్లీతో బన్నీ మూవీ ప్లాన్ చేసుకున్నాడు.

జవాన్ హిట్టైతే పాన్ ఇండియా లెవల్లో అట్లీకి పేరొస్తుంది. తనతో మూవీ చేస్తే తనకి కలిసొస్తుందనేది బన్నీ లెక్క. అలానే జరిగింది. జవాన్ హిట్టైంది. కాని బన్నీ భయపడాల్సి వస్తోంది. ఎందుకంటే జవాన్‌కు మొదటిరోజు రూ.120 కోట్ల వసూల్లొచ్చాయి. అంతవరకు ఓకే. కాని, ఇది సోది సినిమా అంటున్నారు. రొటీన్ మాస్ మసాలా యాక్షన్ డ్రామా ఇది. తెలుగులో, తమిళ్‌లో మనకు మరీ రొటీన్ అనిపించే సీన్లను చుట్టేసి తీస్తే అదే జవాన్. బాలీవుడ్‌కి ఇలాంటివి కొత్త కావొచ్చు కాని, సౌత్‌లో మరీ రొటీన్. అందుకే పాన్ ఇండియా హిట్‌తో దర్శకుడు అట్లీ రేంజ్ పెరిగిందని ఛాన్స్ ఇవ్వాలా..? లేదంటే రొటీన్ ఫార్ములా మూవీలు తీసే తనని దూరంపెట్టాలా..? ఇప్పుడు ఇది బన్నీ టెన్షన్.

తన పుష్ప ఎంత మాస్ మూవీ అయినా, మంచి కంటెంట్ ఉంది కాబట్టే పాన్ఇండియా లెవల్లో బన్నీ పేరు మారుమోగింది. అలా చూస్తే అట్లీతో సినిమా చేయకపోవటమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.