హాలీవుడ్ లో అల్లు అర్జున్.. అక్కడ కూడా రప్పా రప్పా..!

ఎంత ఎదిగిపోయావయ్యా.. అంటూ చిరంజీవి విజేత సినిమాలో ఒక పాట ఉంటుంది. ఇప్పుడు ఈ పాట అల్లు అర్జున్ కు బాగా సూటవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2025 | 01:10 PMLast Updated on: Feb 21, 2025 | 1:10 PM

Allu Arjun In Hollywood

ఎంత ఎదిగిపోయావయ్యా.. అంటూ చిరంజీవి విజేత సినిమాలో ఒక పాట ఉంటుంది. ఇప్పుడు ఈ పాట అల్లు అర్జున్ కు బాగా సూటవుతుంది. ఎక్కడి టాలీవుడ్.. ఎక్కడి హాలీవుడ్ ఎక్కడి నుంచి అల్లు అర్జున్ ఎక్కడికి ఎదిగాడు.. అంటూ బన్నీ ఫ్యాన్స్ కు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు. అలా వైకుంఠపురంలో సినిమాతో కేవలం తెలుగు సినిమా రికార్డులు మాత్రమే తిరగ రాసిన అల్లు అర్జున్.. పుష్పతో ఇండియన్ సినిమా రికార్డులతో చెడుగుడు ఆడాడు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోలకు నిద్రలేకుండా చేస్తున్నాడు బన్నీ. మనది కానీ ఇండస్ట్రీలో 100 కోట్లు వస్తేనే అద్భుతం అనుకుంటాం కానీ ఏకంగా పుష్ప 2 సినిమాతో.. కేవలం హిందీలోనే 800 కోట్లు వసూలు చేసి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు అల్లు అర్జున్.

తాజాగా మరో రికార్డు సాధించాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో కేవలం ఇండియాలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు వారి అబ్బాయిని హాలీవుడ్ సైతం ఎక్కిస్తుందిప్పుడు. ప్రముఖ సినిమా మ్యాగజైన్‌ ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌’.. ఈ మధ్యే ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ ఇండియా’ పేరుతో భారత్‌లోనూ అడుగు పెట్టేసింది. ఈ మ్యాగజైన్‌ తొలి సంచిక అల్లు అర్జున్‌ ఫొటోతో రానుంది. తాజాగా ఈ కవర్ పేజ్‌ ఫొటో షూట్‌ను నిర్వహించారు. ఆ బీటీఎస్‌ ప్రోమో వీడియోను తాజాగా షేర్‌ చేశారు.

ఒకప్పుడు బాలీవుడ్ మ్యాగజైన్స్ మీద మన హీరోల ఫోటోలు పెడితేనే కాలర్ ఎగరేసిన మన అభిమానులకు.. ఇప్పుడు హాలీవుడ్ కూడా ఎదురు వెళ్లి స్వాగతం చెబుతుంది. ఇప్పటికే మన తెలుగు నుంచి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలకు గ్లోబల్ ఇమేజ్ వచ్చేసింది. వీళ్ళ గురించి హాలీవుడ్ కూడా చర్చిస్తుంది. ఇలాంటి సమయంలో పక్కా మాస్ సినిమా చేసిన అల్లు అర్జున్ కూడా హాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాడిప్పుడు. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఇది కేవలం బన్నీ మాత్రమే సాధించిన విజయం కాదు తెలుగు సినిమా సాధించిన విజయం.