ALLU ARJUN: కో అంటే 500 కోట్లు.. తగ్గేదేలే..

తన ఆస్తుల నికర విలువ రూ.460 కోట్ల నుంచి 500 కోట్లున్నాయట. ఐతే ఇవి కేవలం హైదరాబాద్, వైజాగ్, ముంబై, చెన్నైలోని విల్లాల మీద తను పెట్టిన పెట్టుబడి అని తెలుస్తోంది. మొత్తంగా పది ఎకరాల ల్యాండ్ వ్యాల్యూ కలుపుకొని ఇంత కూడబెట్టాడంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2024 | 07:05 PMLast Updated on: Apr 15, 2024 | 7:05 PM

Allu Arjun Invested In Many Business His Networth Is Rs 1000 Crores

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్క సినిమాకు 50 కోట్లు తీసుకుంటాడన్నారు. అంతలోనే అల వైకుంటపురంలో మూవీకి 60 కోట్లు తీసుకున్నాడు. తర్వాత పుష్పకి 75 కోట్లు అందుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 కి వందకోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఎలా చూసినా తన గత పది సినిమాల రెమ్యునరేషన్ లెక్కేసినా 300 కోట్లు దాటవు.

MAHESH BABU: బీ రెడీ.. మహేష్‌ లుక్‌ మారిపోతోంది.. రెడీ అవుతున్న రాజమౌళి

కాని తన ఆస్తుల నికర విలువ రూ.460 కోట్ల నుంచి 500 కోట్లున్నాయట. ఐతే ఇవి కేవలం హైదరాబాద్, వైజాగ్, ముంబై, చెన్నైలోని విల్లాల మీద తను పెట్టిన పెట్టుబడి అని తెలుస్తోంది. మొత్తంగా పది ఎకరాల ల్యాండ్ వ్యాల్యూ కలుపుకొని ఇంత కూడబెట్టాడంటారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అసలైన ఆస్తుల విలువ దాదాపు రూ.1000 కోట్ల పైనే అని తెలుస్తోంది. హైదరాబాద్, వైజాగ్‌లో శివారులో ఫామ్ హౌజ్‌లు, రియల్ ఎస్టేట్‌తో పాటు దుస్తులకు సంబంధించిన బిజినెస్‌లో తను పెట్టిన పెట్టుబడులే తనని కో అంటే వెయ్యికోట్ల అధిపతిని చేశాయని తెలుస్తోంది. అంతేకాదు కాల్ హెల్త్ సర్వీసెస్ నుంచి నర్సింగ్ కేర్, మెడిసిన్.. ఇలా రకరకాల వైద్య సేవలందించే హెల్త్ సర్వీసెస్‌లో కూడా పెట్టుబడులు పెట్టాడట బన్నీ.

మొత్తంగా విజయ్ బట్టల దుకాణం, సమంత మేకప్ ప్రాడక్ట్స్ మీద పెట్టుబడులు పెట్టారు. ఇలా వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం హిందీ స్టార్ల పద్దతులు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఎప్పటినుంచో ఈ తరహా పెట్టుబడులు పెట్టి వెయ్యికోట్లకు పైనే పడగలెత్తాడని ప్రచారం జరుగుతోంది.