దీనెమ్మ పూనకాలు అంతే, మేనమామ ఇంటికి బన్నీ, కాలర్ ఎగరేస్తున్న మెగా ఫ్యాన్స్
దాదాపు అయిదారేళ్ళ నుంచి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనే ప్రచారంలో ఇప్పుడు పుష్ప 2 సినిమా దెబ్బకు క్లారిటీ వచ్చింది రెండు తెలుగు స్టేట్స్ లో. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ తీసుకున్న స్టాండ్, మాట్లాడిన మాటలు అన్నీ కూడా మెగా అభిమానులకు హార్ట్ బీట్ పెంచాయి.
దాదాపు అయిదారేళ్ళ నుంచి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనే ప్రచారంలో ఇప్పుడు పుష్ప 2 సినిమా దెబ్బకు క్లారిటీ వచ్చింది రెండు తెలుగు స్టేట్స్ లో. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ తీసుకున్న స్టాండ్, మాట్లాడిన మాటలు అన్నీ కూడా మెగా అభిమానులకు హార్ట్ బీట్ పెంచాయి. దీనితో వాళ్లకు బ్లడ్ బాయిల్ అయింది. అక్కడి నుంచి పుష్ప సినిమా ఫ్లాప్ అనే ప్రచారాన్ని మెగా అభిమానులు పెద్ద ఎత్తున చేశారు. ఇక పుష్ప సినిమా ప్రమోషన్స్ కు అసలు మెగా ఫ్యామిలీని ఎక్కడ కూడా దగ్గరకు రానీ లేదు అల్లు అర్జున్.
దీనితో ఈ విభేదాలు మరింత తీవ్రంగా ఉన్నాయని విషయం క్లారిటీ వచ్చింది. వాస్తవానికి మెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమా రిలీజ్ చేసినా సరే దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ కుటుంబం నుంచి కచ్చితంగా ఒక స్టార్ ను పిలుస్తూ ఉంటారు. చిన్న హీరోలు కూడా మెగా ఫ్యామిలీ సపోర్ట్ కోసం నానా కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటిదే అల్లు అర్జున్ ఆ రేంజ్ లో పుష్ప 2 సినిమాను ప్లాన్ చేసినా సరే మెగా ఫ్యామిలీని ప్రమోషన్స్ కు దగ్గరకు రానీయలేదు. అయితే ఇప్పుడు ఈ విభేదాలకు పుల్ స్టాప్ పడినట్టుగా తెలుస్తోంది.
పుష్ప 2 సినిమా కొన్ని ప్రాంతాల్లో ఆడక పోవడంతో అల్లు అర్జున్ కాస్త ఇబ్బంది పడినట్లుగా సమాచారం. అందుకే ఇప్పుడు మళ్లీ మెగా ఫ్యామిలీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఒక కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి తన తల్లితో కలిసి వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో ఇక మెగా ఫ్యామిలీలో విభేదాలు లేవని హీరోలు అందరూ ఒకటే అని మెగా ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఇప్పటివరకు పుష్ప సినిమాను చూడని వాళ్ళందరూ చూసే అవకాశం ఉందని అంటున్నారు. గోదావరి జిల్లాలో అసలు పుష్ప 2 సినిమాను ఎవరు చూడలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే షోస్ కూడా రద్దు చేశారు. ఇప్పుడు చిరంజీవిని… ఐకాన్ స్టార్ కలవడంతో కచ్చితంగా మేగా అభిమానులు అందరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో దీని ప్రభావం పెద్దగా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గట్టిగా పడింది. సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దీనికి వైసిపి సపోర్ట్ చేసిన సరే పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కలిసిపోవడంతో వైసిపి నాయకులు కూడా ఒక రకంగా షాక్ అయ్యారు.