ఆ 20 నిమిషాల్లో అల్లు అర్జున్ అప్యాయతో ఆనందంలో శ్రీతేజ్

నిత్యం చాలా ప్రమాదాలు జరుగుతాయి. బాధితులుంటారు, బాధ్యులుంటారు. కానీ ఎక్కడా అల్లు అర్జున్ మాదిరి బాధితుల కోసం పరితపించే వ్యక్తులను చూడమేమో.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2025 | 01:15 PMLast Updated on: Jan 08, 2025 | 1:15 PM

Allu Arjun Meets Sritej In Hospital

నిత్యం చాలా ప్రమాదాలు జరుగుతాయి. బాధితులుంటారు, బాధ్యులుంటారు. కానీ ఎక్కడా అల్లు అర్జున్ మాదిరి బాధితుల కోసం పరితపించే వ్యక్తులను చూడమేమో. ఎందుకంటే బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే అతన్ని పరామర్శించేందుకు తపన పడుతూ వెళ్లిన తర్వాత శ్రీతేజ్ ను చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురైన వైనం ఆయన మనస్తత్వాన్ని చాటుతోంది. తనెంత మానవత్వవాది అన్నది చూపుతోంది. సాటి మనిషి కష్టాన్ని తనదిగా భావించే వ్యక్తిత్వం బయటపడుతుంది.

వాస్తవానికి ఘటన జరిగిన తర్వాత తనకు తెలియగానే ఆ బిడ్డ భవిష్యత్తుకి బాధ్యత తనదేనని చెప్పారు. అంతేగాకుండా తన బిడ్డతో సమానమంటూ కూడా వ్యాఖ్యానించారు. అంతగా తన తీరు చాటుకున్న అల్లు అర్జున్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు బాధితుడితో ఏకాంతంగా మాట్లాడడం ఆసక్తికరం. తనకు సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడేందుకు తగిన అండదందలు అందిస్తామని చెప్పడమే కాకుండా పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ అల్లు అర్జున్ హామీ ఇచ్చిన తీరుతో శ్రీతేజ్ ఎంతో ఆనందాన్ని పొందినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు.

తమ అభిమాన నటుడిని చూడడమే అరుదుగా భావించే శ్రీతేజ్ నేరుగా అల్లు అర్జున్ తనతో అంత సమయం వెచ్చించే సరికి మానసికంగా ఎంతో ధైర్యాన్ని సాధించినట్టుగా చెబుతున్నారు. తాను ఆస్పత్రి నుంచి రిలీవ్ కాగానే అల్లు అర్జున్ ఇంట్లో చాలా సమయం అన్ని కబుర్లు చెప్పుకోవచ్చంటూ హామీ రావడంతో తను కోలుకోవడానికి ఎంతో దోహదపడే అంశంగా భావిస్తున్నారు. మరో మూడు, నాలుగు వారాలయినా ఆస్పత్రిలో ఉండక తప్పదని చెబుతున్న తరుణంలో బన్నీ అందించిన భరోసా బూస్ట్ లా పనిచేస్తుందని భావిస్తున్నారు. బాబు కోలుకోవడానికి దోహదపడే విషయంగా అంచనా వేస్తున్నారు.

అల్లు అర్జున్ కూడా ఎంతో భావోద్వేగంతో బాబ మీద ఆపేక్షను ప్రదర్శించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏదో సాధారణంగా పరామర్శ, పలకరించి రావడం కాకుండా తనకోసం నేనున్నాననే ధీమా కల్పించే యత్నం ఆకట్టుకుంది. తన చుట్టూ ఉన్న వారందరినీ బయటకు వెళ్లమని, తానొక్కడే బాబుతో అంత సమయం గడిపిన తీరు ఆకర్షించింది. ఇలాంటి అప్యాయత ప్రదర్శించే నటులు అరుదుగా ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది. అల్లు అర్జున్ మనసులో ఆ బాబు స్థానాన్ని ఇది చాటుతోందన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అతనికి పూర్తి అండదండలు అందించడానికి, అండగా నిలవడానికి సిద్ధపడిన వైనం చర్చనీయాంశమవుతోంది. నామమాత్రపు పరామర్శ, ప్రచారం కోసం చేసిన ప్రయత్నంలా కాకుండా మనస్ఫూర్తిగా వ్యవహరించిన అల్లు అర్జున్ ని అందరూ అభినందిస్తున్నారు.