మెగాస్టార్‌తో పుష్ప, చిరంజీవి ఇంట్లో ఇది అబ్జర్వ్ చేసారా…?
జైలు నుంచి విడుదలైన తర్వాత మొదటిసారి అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. గత కొన్నాళ్లుగా మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్న అల్లు అర్జున్ అరెస్టు పరిణామాల తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జైలు నుంచి విడుదలైన తర్వాత మొదటిసారి అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. గత కొన్నాళ్లుగా మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్న అల్లు అర్జున్ అరెస్టు పరిణామాల తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. మెగా కుటుంబ ఇమేజ్ నుంచి బయటికి వచ్చేందుకు మూడేళ్ల నుంచి అల్లు అర్జున్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప సినిమా విషయంలో మెగా ఫ్యామిలీ మొత్తాన్ని పక్కన పెట్టాడు.
సినిమా వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అయినా అల్లు అర్జున్ కు రెండు రోజుల క్రితం తగిలిన షాక్ మాత్రం అతని కెరీర్ లోనే అవమానంగా చెప్పుకోవచ్చు. మెగా కుటుంబ అభిమానులతో పాటుగా అల్లు అర్జున్ వ్యతిరేకించే వాళ్ళందరూ చెబుతున్నది ఒకటే మాట. చిరంజీవిని వ్యతిరేకించాడు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది అంటూ ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు సోషల్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా చేస్తున్నారు. తెలుగు హీరోల్లో ఎవరికి అల్లు అర్జున్ కు ఎదురైన పరిస్థితి ఇప్పటివరకు ఎదురు కాలేదు అనే మాట వాస్తవం.
ఒక అరెస్టు దెబ్బతో పాన్ ఇండియా స్టార్ అయ్యాను అనే సంతోషం కూడా లేకుండా చేశారు పోలీసులు. ఈతరణంలో మెగా కుటుంబంతో రాజీకి వెళ్లడమే మంచిది అని అభిప్రాయానికి అల్లు అర్జున్ వచ్చినట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది. తన భార్య అల్లు స్నేహారెడ్డి తో కలిసి బన్నీ ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంట్లో కాస్త భావోద్వేగ వాతావరణం కనిపించింది. చిరంజీవి భార్య, అల్లు అర్జున్ మేనత్త సురేఖ అల్లు అర్జున్ ని చూసి కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఇటీవల కాలంలో అల్లు అర్జున్ ఎక్కడకి వెళ్ళినా పుష్ప సినిమా టీషర్ట్ తోనే కనిపించాడు. కానీ చిరంజీవి దగ్గరకు ఈసారి వెళ్ళినప్పుడు ఆ టీషర్ట్ నీ పక్కన పెట్టాడు. దీనికి కారణం ఏంటి అనేది తెలియకపోయినా పుష్ప సినిమాతోనే అల్లు అర్జున్ కు ఆటిట్యూడ్ పెరిగింది అనే భావనలో చిరంజీవి ఉన్నారు. ఇక చిరంజీవిని కలిసిన సందర్భంగా సినిమా గురించి ఏమీ మాట్లాడకుండా కేవలం వ్యక్తిగత విషయాలతోనే సమయం గడిపినట్లుగా తెలుస్తోంది.
చిరంజీవిని, సురేఖను తన ఇంటికి అల్లు అర్జున్ అలాగే స్నేహారెడ్డి ఇద్దరు ఆహ్వానించారట. అయితే ఈ పరిణామాలను చూస్తున్న ట్రేడ్ అనలిస్టులు మాత్రం పుష్ప సినిమా కలెక్షన్ల కోసమే చిరంజీవిని అల్లు అర్జున్ కలిశాడని, రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే వరల్డ్ వైడ్ గా భారీగా ఉన్న మెగా అభిమానులు సినిమా చూడకపోవడంతో పుష్ప సినిమాకు వసూళ్లు భారీగా తగ్గాయి అనే భావంలో అల్లు అర్జున్ తో పాటుగా మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు కూడా ఉన్నారట. అందుకే తన ఇగో నీ పక్కనపెట్టి చిరంజీవికి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.