రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో అల్లు అర్జున్ మిస్సింగ్.. రీజన్ ఏమై ఉంటుందంటారు..?
మొన్న మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే పార్టీ ఇంట్లో ఘనంగా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు బయటకి వచ్చాయి.

మొన్న మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే పార్టీ ఇంట్లో ఘనంగా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు బయటకి వచ్చాయి. ఉపాసన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ ఫోటోలు పోస్ట్ చేసింది. రామ్ చరణ్ బర్త్ డే పార్టీ చాలా ప్రైవేట్ గా జరిగింది. దీనికి చాలా తక్కువ మంది గెస్ట్ లు వచ్చారు. చరణ్ కు బాగా కావాల్సిన వాళ్ళు మాత్రమే ఈ పార్టీలో కనిపించారు. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీలో తక్కువ ముందే కనిపించారు. ఇంకా చెప్పాలంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ నుంచి నాగార్జున మాత్రమే హాజరయ్యాడు. చిరంజీవి, చరణ్ తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేశాడు మన్మధుడు. ఇక రామ్ చరణ్, శర్వానంద్ కామన్ ఫ్రెండ్ యు వి వంశీ కూడా ఈ పార్టీలో కనిపించాడు. వీళ్ళకి తోడు మెగా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంతా బాగానే ఉంది కానీ రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో అల్లు కుటుంబ సభ్యులు ఎవరు కనిపించలేదు. మెగా ఇంట్లో ప్రతి పార్టీకి హాజరయ్యే అల్లు శిరీష్, అరవింద్ లాంటి వాళ్లు కూడా చరణ్ బర్త్ డే పార్టీలో ఎక్కడ మనకు కనిపించలేదు.
అయితే ఎవరు వచ్చిన రాకపోయినా అభిమానులు ఆరా తీసేది మాత్రం అల్లు అర్జున్ వచ్చాడా లేదా అని..! అనుకున్నట్టుగానే బన్నీ ఈ పార్టీ మిస్ అయ్యాడు. ఆయన మాత్రమే కాదు అతని తరఫునుంచి ఎవరు రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో కనిపించలేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా స్టోరీ సిట్టింగ్స్ లో బన్నీ కూడా కూర్చుంటున్నాడు. అక్కడ బిజీగా ఉన్నాడు కాబట్టే చరణ్ పుట్టినరోజు వేడుకల్లో బన్నీ కనిపించలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ రావాలి అనుకుంటే ఒక్క నైట్ పెద్ద కష్టం కాదు.. అక్కడ కొన్ని గంటలు ఉండి వెళ్లిపోవచ్చు.. కానీ రాలేదు అనే బ్యాచ్ కూడా ఉంది. బన్నీ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు. ఆయన లేకపోయినా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ పార్టీలో కనిపించకపోవడంతో లేనిపోని అనుమానాలు చాలా వస్తున్నాయి. మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కాకపోతే దీన్ని ఎప్పుడు పెద్దది కాకుండా చూస్తుంటాడు పెద్దాయన అల్లు అరవింద్.
మొన్న జరిగిన పార్టీలో ఎవరూ కనిపించకపోయినా.. నిన్న జరిగిన చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్ లో అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అంటే ఈ జనరేషన్ హీరోల మధ్య రిలేషన్ ఎలా ఉన్నా కూడా.. నేనెప్పుడూ ఒకేలా ఉంటామని మెగా బాగా బామ్మర్దులు నిరూపిస్తున్నారు. ఎన్ని మనస్పర్ధలు వచ్చినా.. ఎన్ని గొడవలు జరిగిన.. మా మధ్య బంధం అంతే బలంగా ఉంటుంది అని చూపిస్తున్నారు అల్లు అరవింద్, చిరంజీవి. కాకపోతే అల్లు అర్జున్ దగ్గరికి వచ్చేసరికి ఈ రిలేషన్ కాస్త తగ్గుతుందనేది అర్థమవుతుంది. మా మధ్య ఏం లేదు అంతా బాగానే ఉంది అని వాళ్ళు ఎంత చెప్పుకుంటున్నా కూడా.. ఒకప్పటిలా అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇప్పుడు లేరు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. కెరీర్ లో బిజీ అవడం వల్లే అలా కనిపిస్తుంది అనుకోడానికి కూడా లేదు.. ఎందుకంటే పార్టీ అంటే కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే.. రావాలి అనుకుంటే కచ్చితంగా వస్తారు. రాలేదు అంటే రాకూడదు అనుకున్నారనే కదా అర్థం అనేది కొంతమంది వాదిస్తున్న విషయం. మ్యాటర్ ఏదైనా అల్లు అర్జున్ లేకుండా రామ్ చరణ్ బర్త్ డే పార్టీ జరిగింది. మరి రేపు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు రాబోతుంది.. ఆ పార్టీలో చరణ్ హ్యాండ్ బ్యాచ్ కనిపిస్తారేమో చూడాలి.