పార్ట్ 3 లేదు.. బొక్క లేదు, అల్లు స్టూడియోస్ లో బన్నీ రచ్చ రచ్చ
దాదాపు 5 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీతో పాటు కామన్ పీపుల్ లో కూడా పుష్ప సినిమా గురించి ఎన్నో కామెంట్స్ ఎన్నో చర్చలు వచ్చాయి. ఇక రీసెంట్ గా జరిగిన కొన్ని వ్యవహారాలతో పుష్ప సినిమా పెద్ద రచ్చ రచ్చయింది.
దాదాపు 5 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీతో పాటు కామన్ పీపుల్ లో కూడా పుష్ప సినిమా గురించి ఎన్నో కామెంట్స్ ఎన్నో చర్చలు వచ్చాయి. ఇక రీసెంట్ గా జరిగిన కొన్ని వ్యవహారాలతో పుష్ప సినిమా పెద్ద రచ్చ రచ్చయింది. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఐదేళ్ల నుంచి మరో సినిమా చేయకుండా ఈ సినిమా పైన ఎక్కువగా దృష్టి పెట్టడం, అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా కోసం తన కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా కష్టపడ్డాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయినా సరే హీరో అల్లు అర్జున్ కు మాత్రం ఎక్కడా హ్యాపీనెస్ అనేది లేదు.
తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉండటం పోలీసులు కేసులు పెట్టడం, కోర్టు వరకు వెళ్లడం, మొదటిసారి జైలుకు వెళ్లి రావడం అన్నీ కూడా పుష్ప సినిమా కారణంగానే జరిగాయి. ఇక సామాన్య ప్రజల్లో ఒక సినిమా హీరోని దోషిగా చూడటం కూడా ఈ సినిమా నుంచి మొదలైంది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా మూడో పార్ట్ కూడా వస్తుందని చాలామంది ఎదురు చూశారు. పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ గడ్డం గాని జుట్టు గాని కట్ చేయకపోవడంతో పుష్ప పార్ట్ 3 షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చాలామంది మీడియాలో కామెంట్స్ చేశారు.
అయితే అల్లు అర్జున్ మాత్రం సడన్ గా తన లుక్ మార్చేశాడు. పుష్ప సినిమా గురించి జుట్టు గడ్డం పెంచుకున్న అల్లు అర్జున్ రీసెంట్గా ఆ లుక్కుని మార్చి కనిపించాడు. అయితే ఆ జుట్టు గడ్డం కట్ చేయడం వెనక పెద్ద స్టోరీనే జరిగిందట. పుష్ప పార్ట్ 3 లో కొంత పార్ట్ ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని మిగిలిన కొంత పార్ట్ పూర్తయితే.. సినిమా కంప్లీట్ చేసేయవచ్చు అని సుకుమార్ రిక్వెస్ట్ చేశాడట. బన్నీ స్క్రీన్ ప్రేజేన్స్ 3 లో తక్కువ ఉంటుందట. కానీ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు, సుకుమార్ బిహేవియర్ అన్నీ చూసుకున్న అల్లు అర్జున్ తాను సినిమా చేయడం లేదని పుష్ప పార్ట్ 3 ఇక లేదని దయచేసి తనని ఫోర్స్ చేయొద్దని క్లియర్ కట్ గా చెప్పేసాడట.
దీని కోసం సుక్కు.. అల్లు స్టూడియోస్లో అల్లు అర్జున్ ను కలిసాడు. వాస్తవానికి పుష్ప పార్ట్ 2 రిజల్ట్ చూసిన తర్వాత పుష్ప 3 షూటింగ్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. కానీ తర్వాత పరిస్థితులు మారడంతో ఆ సినిమాను దాదాపుగా పక్కన పెట్టారు. ఇక సుకుమార్ కూడా మరో సినిమా లేకుండా ఖాళీగా ఉండటం అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే సినిమా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉండటంతో మూడో పార్ట్ పై వీళ్ళ మధ్య చర్చ జరిగింది. కానీ జరిగిన పరిణామాలతో చిరాకులో ఉన్న అల్లు అర్జున్… ఇక పుష్ప సీరీస్ ను పూర్తిగా వదిలేసినట్లు తెలుస్తోంది. సెంటిమెంట్ పరంగా కూడా పుష్ప కలిసి రాలేదని అల్లు అర్జున్ లో ఒక రకమైన భయం కూడా ఉందట.