బ్రేకింగ్: పవన్ కు పుష్ప ఫోన్… అమరావతి వెళ్తున్న బన్నీ
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అనే ఆసక్తి ఎక్కువగా ఉంది. సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఓ రేంజ్ ఇమేజ్ ఉంది. కాని ఈ మధ్య కాలంలో ఫ్యామిలీలో వచ్చిన చీలిక ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేస్తోంది.
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అనే ఆసక్తి ఎక్కువగా ఉంది. సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఓ రేంజ్ ఇమేజ్ ఉంది. కాని ఈ మధ్య కాలంలో ఫ్యామిలీలో వచ్చిన చీలిక ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేస్తోంది. అసలు ఆ బగ్ ఏంటీ అని ఫ్యాన్స్ బాగా సెర్చ్ చేయడం స్టార్ట్ చేసారు. రెండు వైపులా తప్పు ఉందని గ్రహించిన వాళ్ళు సైలెంట్ గా ఉంటే… లేదు… ఒక వైపే తప్పు ఉంది అనుకున్న వాళ్ళు… యాంటీ ఫ్యాన్స్ అవతారం ఎత్తి సినిమాలను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసారు. పుష్ప 2 ను అలాగే టార్గెట్ చేసారు.
అయితే ఈ గ్యాప్ తగ్గించడానికి బన్నీ ట్రై చేసినా… మట్కా ఈవెంట్ లో… వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ తో వివాదం మరింత పెద్దగా కనపడింది. ఈ టైం లో ఓ న్యూస్ పొలిటికల్, మూవీ సర్కిల్స్ ను ఓ రేంజ్ లో షేక్ చేసేస్తోంది. అదేంటి అంటే… ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు… అల్లు అర్జున్ ఫోన్ చేసాడు అనే న్యూస్. రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ గురించి రెండు ముక్కలు మాట్లాడాడు బన్నీ. ఇతర మెగా హీరోల గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అసలు జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేసారనే కోపం పవన్ లో ఉంది అంటారు.
అందుకే అటవీ శాఖ సభలో పవన్… పుష్ప మూవీపై కామెంట్స్ చేసారని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ గ్యాప్ ను తగ్గించడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ ను కలవడానికి బన్నీ అమరావతి వెళ్తున్నాడు. అమరావతిలో పవన్ కు… పుష్ప హైదరాబాద్ ఈవెంట్ కు సంబంధించి ఓ ఇన్విటేషన్ కూడా ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడగగా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ వారంలో లేదంటే వచ్చే సోమవారం… పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్… అమరావతిలో కలిసే అవకాశం ఉంది.
వాస్తవానికి సోమవారం కలవాలి అని ప్లాన్ చేసినా… పవన్ బిజీగా ఉండటం, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఉండటంతో సాధ్యం కాలేదు అని సమాచారం. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఈ న్యూస్ మాత్రం షేక్ చేస్తోంది. అయితే ఇక్కడ బన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడని టాక్. పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎక్కువగా పుష్ప 2 ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉండటం, అలాగే సినిమా ధరలు పెంచాలి అని కూడా అడిగే అవకాశం ఉండటంతోనే బన్నీ వస్తున్నాడని అంటున్నారు. సినిమాకు సంబంధించిన శాఖ కూడా జనసేన పార్టీ వద్దనే ఉండటంతో బన్నీ వస్తున్నట్టు తెలుస్తోంది.