దాదాపు నెల రోజుల నుంచి అల్లు అర్జున్ ఒక రకంగా నరకం స్పెల్లింగ్ రాస్తున్నాడు. తెలిసి చేసిన తప్పు తెలియక చేసిన తప్పో గాని.. ఇప్పుడు పోలీస్ అనే పదం ఏంటి మనోడికి మెంటల్ ఎక్కుతుంది. ఎప్పుడు ఏ పెంట పెడతారో తెలీక.. ఆఫ్ ఆఫ్ గా ఉన్నాడు. పుష్ప పార్ట్ 2 సినిమా నేషనల్ లెవెల్ లో గ్రాండ్ సక్సెస్ అయినా సరే మనోడిలో ఆ జోష్ కనబడటం లేదు. బయటికి వచ్చి మాట్లాడదామన్నా ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుందనే భయంతో పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఒక రకంగా ఇంట్లోనే ఉంటూ చివరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు కూడా దూరంగానే ఉండిపోయాడు. అన్ని బాగుంటే పుష్పా సెలబ్రేషన్స్ ను యూరప్ లో సెలబ్రేట్ చేసుకుందామని రెడీ అయిన అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి దెబ్బకు కుదేలు అయిపోయాడు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి అంత సీరియస్గా తీసుకుంటారని అసలు అల్లు అర్జున్ కాదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ను బయటకు తీసుకురావడానికి ఆయన తండ్రి అల్లు అరవింద్ అలాగే ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు తీవ్ర కష్టాలు పడుతున్నారు. అయితే లేటెస్ట్ గా కాస్త రిలీఫ్ వచ్చింది. అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. మరి ఈ బెయిల్ పై తెలంగాణ పోలీసులు ఏ స్టెప్పు తీసుకుంటారు అనే దానిపై క్లారిటీ లేదు గాని సుప్రీంకోర్టుకు వెళతారు అనే న్యూస్ కూడా మొన్నామధ్య వచ్చింది. అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉండటంతో పోలీసులు కూడా కాస్త కఠినంగానే బిహేవ్ చేస్తున్నారు. మీ సినిమాలు చూస్తాం అలాగే అవసరమైతే మిమ్మల్ని అరెస్టు కూడా చేస్తామంటూ అల్లు అర్జున్ కు పక్కా సిగ్నల్స్ ఇచ్చారు. అరెస్టు చేసి చూపించి తమ దమ్ము ఏంటో క్లారిటీ ఇచ్చారు. ఇక బెయిల్ రావడంతో సినిమా షూటింగులు మొదలు పెట్టాలా లేదంటే కొన్నాళ్లు గ్యాప్ తీసుకోవాలా అనేదానిపై అల్లు అర్జున్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. బెయిల్ వస్తే కచ్చితంగా హాలిడే కోసం బయటకు వెళ్లాలని బన్నీ ప్లాన్ చేసుకున్నాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తే అనవసరంగా ఏదో ఒక రచ్చవుతుందని.. కేసు ఉండగా సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారని హడావుడి కూడా జరిగే ఛాన్స్ ఉందని బయటకు కూడా వెళ్ళలేదు. ఇక ఇప్పుడు బెయిల్ రావడంతో కోర్టు అనుమతి తీసుకుని కన్నడ వెళ్లి కొన్ని రోజులు ఉండి రావాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే.. టికెట్లు కూడా బుక్ చేశారంట. ముందు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం యూరప్ వెళ్లాలని ప్లాన్ చేసుకుని ఎప్పుడో టికెట్స్ బుక్ చేసేసినా.. ప్రీమియర్ షో ఇచ్చిన షాకుకు ఇంట్లోనే ఉండి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు బెయిల్ రావడంతో వెంటనే కోర్టులో.. ఒక పిటిషన్ వేసుకుని అనుమతి తీసుకుని ఈ వ్యవహారాలన్నింటి నుంచి బయటకు రావాలని బన్నీ వైఫ్ స్నేహ రెడ్డి ప్లాన్ చేశారు. గత నెల రోజుల నుంచి తన భర్త మానసిక పరిస్థితిని దగ్గర నుంచి గమనిస్తున్న స్నేహ రెడ్డి ఎలాగైనా సరే కాస్త రిలీఫ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.[embed]https://www.youtube.com/watch?v=jqKJXKijOqs[/embed]