నాన్నా ఆపుతారా, ఆపనా…? అల్లు అరవింద్ ఇంటికి బన్నీ
మెగా ఫ్యామిలీ అంటే ఒకటే అనేది ఇప్పటి వరకు అభిమానుల భావన. కాని మెగా ఫ్యామిలీలో ఇంకో బ్రాంచ్ కూడా ఉందనేది గత కొన్ని రోజులుగా అర్ధమవుతున్నది. అసలు బ్రాంచ్ కాదు మాకు వాళ్లకు సంబంధం లేదు... మాది మేమే వాళ్ళది వాళ్ళే కేవలం బంధువులం మాత్రమే అంటున్నారు.
మెగా ఫ్యామిలీ అంటే ఒకటే అనేది ఇప్పటి వరకు అభిమానుల భావన. కాని మెగా ఫ్యామిలీలో ఇంకో బ్రాంచ్ కూడా ఉందనేది గత కొన్ని రోజులుగా అర్ధమవుతున్నది. అసలు బ్రాంచ్ కాదు మాకు వాళ్లకు సంబంధం లేదు… మాది మేమే వాళ్ళది వాళ్ళే కేవలం బంధువులం మాత్రమే అంటున్నారు. ఈ వివాదం చినికి చినికి గాలి వాన అవుతుంది. నాలుగు రోజులు పోతే తుఫాన్, ఆ తర్వాత అవసరమైతే సునామీ కూడా అయ్యేలాగే ఉంది. ఇందులో మెగా ఫ్యామిలీ నుంచి సారీ… అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ మాత్రమే బయటకు వచ్చి మాట్లాడారు.
మెగా ఫ్యామిలీలో అంటే కొణిదెల వాళ్ళు ఎవరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇక జనసేన నేతలు పదే పదే బయటకు వచ్చి అల్లు అర్జున్ ను ఘాటుగా… విమర్శలు చేస్తున్నారు. నేడు ఒక నేత అయితే ఆ ఘాటు ఎక్కువై కడుపులో మండే వరకు మాట్లాడారు. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ రియాక్షన్ గట్టిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నేను మాట్లాడటం లేదంటే చేత కాక కాదు… కావాలనే మాట్లాడటం లేదు, అసలు మీకు ఈ గొడవకు ఏం సంబంధం అని ఆయన రియాక్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
తన తండ్రి అల్లు ఆరవింద్ ఇంటికి వెళ్లి ఈ విషయం గురించి మాట్లాడటానికి బన్నీ రెడీ అవుతున్నట్టుగా సమాచారం. జనసేన నేతలను కంట్రోల్ చేయించాలని, హద్దు మీరి మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పడానికి ఆయన రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మీడియా సమావేశం పెట్టి అల్లు అర్జున్ కొన్ని విషయాలను మీడియా ముందే మాట్లాడటానికి సిద్దమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి అల్లు అర్జున్ ది భయమో లేక ఆత్మగౌరవమో అర్ధం కాని పరిస్థితి. ఆయనకు కోపం ఉంది ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎదురు చూస్తే మంచిది అంటారు కొందరు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కంట్రోల్ అయితే బాగుంటుందని, ఇక మెగా హీరోలు కూడా జాగ్రత్తగా ఉంటే బన్నీ మాట్లాడే ప్రయత్నం చేయరు కదా అని మరికొందరు అంటున్నారు. తప్పు ఎవరిదైనా వినోదం మాత్రం అందరిది.