Allu Arvind: వరుణ్, లావణ్య పెళ్లి గురించి ముందే చెప్పిన అల్లు అరవింద్
మెగా ఫ్యామిలీలోకి కొత్త కోడలు రాబోతోంది. అంతా అనకున్నట్టుగానే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారు. చాలా సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరూ జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అవ్వబోతోంది.

Allu Arjun posted this video on his Instagram where Allu Arvind predicted about Varun Tej Lavanya Tripathi's love.
ఇలాంటి సందర్భంలో లావణ్య గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ఫంక్షన్‌లో అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠిని ఆటపట్టించాడు. నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు.. ఇక్కడే ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్పాడు. కట్ చేస్తే లావణ్య వరుణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ వీడియోను, వరుణ్ లావణ్య ఎంగేజ్‌మెంట్ ఫొటోను అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మై డాడ్ ఈజ్ విజనరీ అంటూ రీల్ పెట్టాడు. అప్పుడు ఆయన చెప్పిందే ఇప్పుడు నిజమైంది అంటూ చెప్పాడు. అల్లు అర్జున్ పెట్టిన రీల్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఏంటి అల్లు అరవింద్ క్యాజువల్‌గా చెప్తే లావణ్య సీరియస్‌గా తీసుకుందా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
Bunny annaya insta story Allu Aravind Gari visionary 🥳 @alluarjun ❤️👑🦁 #AlluArjun #Pushpa2TheRule #VarunLav #PushpaTheRise #LavanyaTripathi #AlluArjun𓃵 #PushpaTheRule #Pushpa #Pushpa2 pic.twitter.com/jN0cOAx8qf
— Tej (@DEMI_GOD__BUNNY) June 10, 2023