Pushpa 2: పుష్ప వచ్చేస్తున్నాడు.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!

పుష్ప-2 రిలీజ్‌ డేట్‌ను మైత్రి మూవీ మేకర్స్‌ అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ కథలో చాలా మార్పులు చేసిన కారణంగా సినిమా రిలీజ్‌ డేట్‌ పొడిగించినట్టు తెలుస్తోంది. పుష్ప మొదటి పార్ట్‌కు ఆడియన్స్‌ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 11, 2023 | 04:49 PMLast Updated on: Sep 11, 2023 | 4:49 PM

Allu Arjun Pushpa 2 Locks Its Release Date Clash With Ajay Devgns Singham Again

Pushpa 2: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు ఓ పెద్ద అప్‌డేట్‌ ఇచ్చాడు డైరెక్టర్‌ సుకుమార్‌. బన్నీ ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప-2 రిలీజ్‌ డేట్‌ను ఎనౌన్స్‌ చేశారు. సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న రిలీజ్‌ చేయబోతున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ చేస్తారని అంతా అనుకున్నారు.

కానీ కథలో చాలా మార్పులు చేసిన కారణంగా సినిమా రిలీజ్‌ డేట్‌ పొడిగించినట్టు తెలుస్తోంది. పుష్ప మొదటి పార్ట్‌కు ఆడియన్స్‌ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. సౌత్‌తో కంపేర్‌ చేస్తే నార్త్‌లో పుష్ప క్రియేట్‌ చేసిన వైబ్రేషన్స్‌ వేరే లెవెల్‌. దీంతో సెకండ్‌ పార్ట్‌ మీద అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు అల్లు అర్జున్‌కు నేషనల్‌ అవార్డ్‌ కూడా రావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్‌. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ను ఏమాత్రం డిసప్పాయింట్‌ అవ్వకుండా సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు లెక్కల మాస్టర్‌ సుకుమార్‌.

సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న కారణంగానే మేకింగ్‌ లేటవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా సగం షూటింగ్‌ కంప్లీక్‌ అవ్వగా మిగతా సగం షూట్‌ చేయాల్సి ఉంది. మొదటి పార్ట్‌తో వండర్స్‌ క్రియేట్‌ చేసిన సుక్కూ.. సెకండ్‌ పార్ట్‌తో ఎలాంటి రికార్డ్‌ క్రియేట్‌ చేస్తాడో చూడాలి.