PUSHPA 2: సలార్ రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప.. నైజాం రికార్డ్ బన్నీదే..!

సలార్ కూడా రూ.75 కోట్లకే నైజాం రైట్స్ సేల్ అయ్యాయి. అలాంటిది పుష్ప 2కి వందకోట్లు ఒక్క నైజాం నుంచి రాబోతుండటం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఆంధ్రా, సీడెడ్ నుంచి వందకోట్లు, కేరళ రైట్స్ రూ.50 కోట్లు, తమిళనాడు రూ.80 కోట్లు, కర్ణాటక రూ.60 కోట్లు, నార్త్ ఇండియా రైట్స్ రూ.300 కోట్లకి సేల్ అయ్యాయట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2024 | 08:01 PMLast Updated on: Apr 10, 2024 | 8:01 PM

Allu Arjun Pushpa 2 Movie Business Is On Sky High With Rs 999 Cr

PUSHPA 2: పుష్ప రాజ్ రెండో సారి బాక్సాఫీస్ మీద దండెత్తేలోపే వెయ్యికోట్ల లెక్కలు తేలేలా ఉన్నాయి. బాలీవుడ్ ఖాన్లు, కపూర్లు కూడా షాక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పుష్ప 2 మూవీ నైజాg ఏరియా రైట్స్ వందకోట్లు పలికాయి. త్రిబుల్ ఆర్, బాహుబలి కూడా ఇంత భారీగా ధర పలకలేదు. సలార్ కూడా రూ.75 కోట్లకే నైజాం రైట్స్ సేల్ అయ్యాయి.

PRABHAS: హాలీవుడ్ రీమేక్.. ప్రభాస్ రూ.2000 కోట్ల బొమ్మ మిస్సయిపోయిందే..

అలాంటిది పుష్ప 2కి వందకోట్లు ఒక్క నైజాం నుంచి రాబోతుండటం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఆంధ్రా, సీడెడ్ నుంచి వందకోట్లు, కేరళ రైట్స్ రూ.50 కోట్లు, తమిళనాడు రూ.80 కోట్లు, కర్ణాటక రూ.60 కోట్లు, నార్త్ ఇండియా రైట్స్ రూ.300 కోట్లకి సేల్ అయ్యాయట. ఇక యూఎస్ రైట్స్‌తో కలుపుకొని రూ.750 కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో దక్కుతున్నాయని తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ అన్నిభాషలకు కలిపి రూ.149 కోట్లు దర పలికితే, ఓటీటీ రైట్స్ రూ.200 కోట్లని తేలింది.

ఇలా ఇవన్నీ లెక్కేస్తే పుష్ప 2 రిలీజ్‌కి ముందే టేబుల్ మీద 999 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసేస్తోందట. విచిత్రం ఏంటంటే వెయ్యికోట్లకి ఒక కోటి తగ్గింది. 999 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే.. ఏ మాత్రం అంచనాలను రీచైనా 1500 కోట్ల క్లబ్‌లో పుష్పరాజ్ చేరే ఛాన్స్ ఉంది.