Allu Arjun: పుష్ప రాజ్ “2024 ఏప్రిల్ 7″న విడుదల.. ఇంకా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. కేవలం అఫీషియల్ గా ఎనౌన్స్ చేయటమే తరువాయని తెలుస్తోంది. ఐతే బాలీవుడ్, తోపాటు కోలీవుడ్, లో మిగతా హీరోల రిలీజ్ డేట్లు తేలితే పుష్ప 2 విడుదల తేదీని ధైర్యంగా ఎనౌన్స్ చేయాలని చూస్తోంది ఫిల్మ్ టీం. అందుకోసం దసరానే ముహూర్తం చూసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 11, 2023 | 07:15 PMLast Updated on: Apr 11, 2023 | 7:15 PM

Allu Arjun Pushpa 2 Relese On April 2024

ఏప్రిల్ 7న పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు. పుష్ప ది రూల్ అప్పుడే రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి 2021 క్రిస్మస్ కి వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కి వస్తుందనుకున్నారు. రెండేళ్ల గ్యాప్ తోఊపేస్తాడనుకున్నారు. కాని మేకింగ్ కి టైం పట్టేలా ఉంది. ప్రమోషన్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సో ఫస్ట్ పార్ట్ కి ప్రమోషన్ కుదర్లేదు కాబట్టే సెకండ్ పార్ట్ కి భారీగా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. అవన్నీ కుదరాలంటే క్రిస్మస్ కాని, సంక్రాంతి కాని రిలీజ్ సరైన నిర్ణయం కాదట

అందుకే 2024 సమ్మర్ కి ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి ఏ హీరో సినిమాలు సీన్ లో లేని టైం చూసి, తోటి నిర్మాతలో మాట్లాడి ఏప్రిల్ 7కి ముహుర్తం చూశారు. అప్పుడే రిలీజ్ చేస్తారు. ఈ రిలీజ్ డేట్ ని ఆగస్ట్ 15 కి లేదంటే దసరాకే ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.