Pushpa 2 : పుష్ప 2 అప్ డేట్ రెడీ.. 200 కోట్ల సర్ ప్రైజ్.. !

పుష్ప ది రైజ్ తర్వాత తెరకెక్కుతున్న మూవీ పుష్ప ది రూల్... ఈ సీక్వెల్ క్రిస్మస్ కి వస్తుందా? సమ్మర్ కే రానుందా? ఈ డౌట్ల కంటేముందు మరో డౌట్ కి గేట్ తెరిచింది ఫిల్మ్ టీం. ఈ సినిమా అప్ డేట్ లోడింగ్ అంటూ హైప్ ని పెంచుతోంది. బన్నీ బర్త్ డేకి ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తోంది సుకుమార్ టీం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2023 | 09:30 PMLast Updated on: Apr 01, 2023 | 9:30 PM

Allu Arjun Pushpa 2 Surprice

పుష్ప 2 టీజర్ 55 సెకన్లతో ఎడిట్ చేశారని తెలుస్తోంది. నిజానికి 90 సెకన్లు అంటే, నిమిషమున్నర టీజర్ కట్ చేసిన టీం, తర్వాత అందులో 35 సెకన్లు తీసేసిందట. అది ఫైట్ సీన్ అని లీకులు వస్తున్నాయి. ఏదేమైనా ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే కావటంతో, ఒకరోజు ముందే ఫ్యాన్స్ కి టీజర్ తో ట్రీట్ రెడీ చేస్తున్నాడు లెక్కల మాస్టార్ సుకుమార్

ఇక పుష్ప 2 టీజర్ ఏప్రిల్ 7 న సర్ ప్రైజ్ చేయబోతుంటే, ఈలోపే ఓ రికార్డుని క్రియేట్ చేశాడు పుష్పరాజ్. అదే ఓటీటీ రైట్స్. ఈ సినిమా ఓటీటీ రైట్స్ 200కోట్లకు సేల్ అయ్యాయి. ఇక శాటిలైట్ రైట్స్ 170 కోట్లని తెలుస్తోంది. ఆడియోరైట్స్ 70 కోట్లనటంతో, ఈమూవీకి పెట్టే పెట్టుబడి 450 కోట్లు కేవలం, ఆడియో, శాటిలైట్, ఓటీటీ రైట్స్ తోనే ఎనక్కి వచ్చేసింది. ఇక రిలీజ్అయ్యాక వచ్చే సునామీ ఏరేంజ్ లో ఉంటుందో వేచి చూడాల్సిందే..