Pushpa 2 The Rule: పుష్ప సోలో రిలీజ్.. మమరో బాహుబలి-2, కేజీఎఫ్-2లా సునామీ ఖాయమా..?
బాలీవుడ్‌లో ఆగస్ట్ 14 కి రావాల్సిన సింగం ఎగైన్ మూవీ వాయిదా పడింది. తమిళ దళపతి మూవీ గోట్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 5కి వాయిదా పడింది. ఇక లోక నాయకుడు కమల్ హాసన్‌తో శంకర్ తీసిన భారతీయుడు జూన్‌లోనే వస్తోంది.

Pushpa 2 The Rule: పుష్ప 2 ఆగస్ట్ 15కి రాబోతోంది. రిలీజ్ డేట్‌లో మార్పులేదని మొన్న టీజర్‌తో తేల్చారు. కాని ఆగస్ట్ 15కి నార్త్ ఇండియాలో సింగం ఎగైన్, కోలీవుడ్‌లో గోట్ మూవీ, భారతీయుడు 2 సినిమాలతో పోటీ అన్నారు. కాని గాలికి మబ్బులు కొట్టుకుపోయినట్టు పుష్పరాజ్ టీజర్ రాగానే, పోటీ ఇచ్చే మూవీలన్నీమూలకు పోయాయి.
Akshay Kumar: అఫీషియల్.. అక్షయ్ వచ్చేశాడు.. మరి ప్రభాస్ మాటేంటి
బాలీవుడ్‌లో ఆగస్ట్ 14 కి రావాల్సిన సింగం ఎగైన్ మూవీ వాయిదా పడింది. తమిళ దళపతి మూవీ గోట్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 5కి వాయిదా పడింది. ఇక లోక నాయకుడు కమల్ హాసన్‌తో శంకర్ తీసిన భారతీయుడు జూన్‌లోనే వస్తోంది. కాబట్టి, ఆగష్టులో తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ మార్కెట్లలో కూడా పుష్పరాజ్‌కి ఎదురే లేదు. అసలే పుష్ప మొదటి భాగం ప్రమోషన్ లేకుండా వచ్చి హిందీలో వందకోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా రూ.450 కోట్లు రాబట్టింది.
అలాంటిది బాహుబలి తర్వాత బాహుబలి 2 వచ్చినట్టు కేజీయఫ్ తర్వాత కేజీయఫ్ 2 వచ్చినట్టు, పుష్ప తర్వాత పుష్ప ది రూల్ భారీ అంచనాలతో వస్తోంది. కాబట్టి కాసుల సునామీ కన్ఫామ్ అయ్యింది. పోటీ కూడా లేకపోవటం చూస్తుంటే, పాన్ ఇండియా లెవల్లో వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. మరో సారి పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అని ప్రూవ్ కాబోతోంది.