Allu Arjun: రీషూట్.. సుకుమార్‌పై ఒత్తిడి పెంచుతున్న అల్లు అర్జున్..?

ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ ప్రకారం, పుష్ప 2 ముగింపులో పుష్ప 3కి లీడ్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. పుష్ప 3తో పాటు పుష్ప 2 విడుదల విషయంలోనూ అల్లు అర్జున్ సుకుమార్‌పై చాలా ఒత్తిడి చేస్తున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 08:36 PMLast Updated on: Feb 22, 2024 | 8:36 PM

Allu Arjun Puts Pressure On Director Sukumar For Pushpa 2

Allu Arjun: 2021లో విడుదలైన పుష్ప ది రైజ్-పార్ట్ 1 ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ప్రారంభించారు. అల్లు అర్జున్, సుకుమార్ ఆలస్యం చేయకుండా పుష్ప 2 ది రూల్ ప్రీ-ప్రొడక్షన్ పనులను వెంటనే ప్రారంభించారు. కానీ.. ఈ మూవీ నుంచి పెద్దగా అప్‌డేట్ ఇప్పటి వరకు రాలేదు. అప్పుడెప్పుడో ఓ వీడియో రిలీజ్ చేశారు అంతే. మూవీ విడుదలపై క్లారిటీ ఇవ్వలేదు.

INDIA TRAVEL: ఇక్కడ క్లిక్కుతో కిక్కే.. ఫొటోల కోసం బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్..!

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ ప్రకారం, పుష్ప 2 ముగింపులో పుష్ప 3కి లీడ్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. పుష్ప 3తో పాటు పుష్ప 2 విడుదల విషయంలోనూ అల్లు అర్జున్ సుకుమార్‌పై చాలా ఒత్తిడి చేస్తున్నారట. సుకుమార్.. రాజమౌళిలా ఒక్క షాట్ కుదరక పోయినా మళ్లీ మళ్లీ తీస్తూ తనకి కావాల్సింది వచ్చేదాకా కష్టపడుతూనే ఉంటాడు. పుష్ప లాంటి భారీ హిట్‌ ఇచ్చిన సుకుమార్‌ నుంచి ఆటోమేటిక్‌గా ఒత్తిడి ఉంటుంది. అయితే ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను ఆయన రీషూట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ మూవీని ఆగస్ట్ 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన మూవీ టీం.. ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. కానీ అల్లు అర్జున్ మాత్రం మనం లాక్ చేసిన తేదీకి సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడని, అందుకే సినిమా టీమ్‌పైనా, సుకుమార్‌పైనా తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడట. దాంతో రెండో యూనిట్ కూడా షూటింగ్ జరుపుతోందని, వీలైతే మూడో యూనిట్ కూడా పని చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

జూన్ లేదా జులైలోపు సినిమా షూటింగ్ పూర్తయితే, కనీసం ఆగస్ట్‌లో అయినా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ చేసుకోవచ్చు అనేది అల్లు అర్జున్ ప్లాన్. కానీ ఈ రకమైన ఒత్తిడి కారణంగా, సుకుమార్ కోరుకున్నది రాకపోతే, అల్లు అర్జున్ గడువుతో సుకుమార్ తన పరిపూర్ణతను సమతుల్యం చేసుకోవడం చాలా కష్టమైన పని. అనుకున్న సమయానికి విడుదల చేస్తారా లేక వాయిదా పడుతుందా అనే విషయంపై క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే. అయితే, విడుదల తేదీపై అల్లు అర్జున్ “తగ్గెడే లే” అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.