ALLU ARJUN: ఫ్యాన్స్ కోసం కోట్లు వదులుకున్న బన్నీ.. అసలు కారణమిదే..!
పుష్ప రాజ్ పాత్ర మందు తాగే సీన్ టైంలో గ్లాస్ మీద ఆ బ్రాండీ కంపెనీ పేరు ఉండేలా సైన్ చేస్తే రూ.10 కోట్లిస్తామన్నారట. అంతేకాదు యాడ్‌లో నటిస్టే మరో పది కోట్లు. అలానే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే రూ.70 కోట్లు ఇస్తామన్నారు.
ALLU ARJUN: అల్లు అర్జున్‌కి మూడు ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్ల కోసం తనేం కష్టపడాల్సిన పనిలేదు. జస్ట్ సైన్ చేస్తే ఒక్కో ఆఫర్‌కి పది కోట్ల చొప్పున రూ.30 కోట్లు తన జేబులో పడతాయి. తను ఒప్పుకుంటే బ్రాండ్ అంబాసిడర్‌గా ఏడాదికి రూ.వందకోట్ల వరకు సొంతం చేసుకోవచ్చు. కాని నో చెప్పాడు బన్నీ. దేనికనుకుంటున్నారా..? లిక్కర్, పాన్ మసాలా యాడ్స్‌కి. అవును.. పుష్ప రాజ్ పాత్ర మందు తాగే సీన్ టైంలో గ్లాస్ మీద ఆ బ్రాండీ కంపెనీ పేరు ఉండేలా సైన్ చేస్తే రూ.10 కోట్లిస్తామన్నారట.
SALAAR FIRST REVIEW: సైడ్ ఇవ్వాల్సిందే.. సలార్ ఫస్ట్ రివ్యూ..
అంతేకాదు యాడ్‌లో నటిస్టే మరో పది కోట్లు. అలానే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే రూ.70 కోట్లు ఇస్తామన్నారు. మొత్తంగా వీటితోనే రూ.90 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పాన్ మసాలా కంపెనీ కూడా పదికోట్ల యాడ్ ఆఫర్ చేసింది. ఐతే వీటన్నీంటికి సున్నితంగా తిరస్కరించాడట బన్నీ. దీనివల్ల తను వందకోట్లు కోల్పోవాల్సివస్తోంది. అయినా ఫ్యాన్స్‌కి, జనానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదని మందుని, పాన్ మసాలాని ప్రమోట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు.
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కూడా ఇలాంటి యాడ్స్‌కి మొదట్నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. హిందీలో మాత్రం ఖాన్‌లు, కపూర్‌లు, కుమార్‌లు ఇలాంటి యాడ్స్ చేసి సొసైటీతో తిట్లు పడుతున్నారు. ఏదేమైనా ఇలాంటి యాడ్స్‌కి నో చెప్పి పుష్పరాజ్ తగ్గి.. నెగ్గాడు.