పిలిచేద్దాం, చిరంజీవికి బన్నీ ఫోన్, డాడీతో రిక్వస్ట్
పుష్ప సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ కు కత్తి మీద సాములా మారాయి. సినిమా సూపర్ హిట్ అనే కాన్ఫిడెన్స్ ఉన్నా సరే లోపల ఏదో భయం వెంటాడుతూనే ఉంది. సినిమా ఈవెంట్స్ అన్నీ ఓ రేంజ్ లో ప్లాన్ చేసారు.
పుష్ప సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ కు కత్తి మీద సాములా మారాయి. సినిమా సూపర్ హిట్ అనే కాన్ఫిడెన్స్ ఉన్నా సరే లోపల ఏదో భయం వెంటాడుతూనే ఉంది. సినిమా ఈవెంట్స్ అన్నీ ఓ రేంజ్ లో ప్లాన్ చేసారు. ఇండియా వైడ్ గా ఏడు ఈవెంట్స్ ను ప్లాన్ చేసి… పాట్నా, చెన్నై, కేరళ ఈవెంట్స్ సూపర్ సక్సెస్ చేసినా సరే ఏదో భయం మాత్రం మేకర్స్ లో ఉంది. పాట్నా ఈవెంట్ లో పుష్ప ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఆ తర్వాత చెన్నై ఈవెంట్ లో ఓ సాంగ్ ను రిలీజ్ చేసారు. కేరళ ఈవెంట్ ను ఫుల్ జోష్ తో ప్లాన్ చేసారు.
కాని భయం మాత్రం ఓ రేంజ్ లో ఉంది. కారణం యాంటీ ఫ్యాన్స్. మెగా ఫ్యాన్స్ సినిమాపై పగబట్టారు. పాట్నా ఈవెంట్ నుంచి సినిమాను అన్ని విషయాల్లో ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఏ అప్డేట్ వచ్చినా సరే సినిమా ఫ్లాప్ అంటూ భయపెడుతున్నారు. కాని మేకర్స్ లో ఆ భయం లేదు. బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా సినిమా కోసం పిచ్చ పిచ్చగా ఎదురు చూస్తున్నారు. ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ కంటే నార్మల్ ఆడియన్స్ ఎక్కువగా వైరల్ చేస్తున్నారు. బన్నీ ధీమా కూడా అదే.
ఇక్కడ యాంటీ ఫ్యాన్స్ భయం అల్లు అర్జున్ లో ఎక్కువగా ఉండటంతో మేకర్స్ బన్నీని ఓ రిక్వస్ట్ చేసినట్టు సమాచారం. హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ నుంచి ప్రముఖులు రావాల్సిందే అని అడిగారట. ఇక బన్నీ కూడా ఈ విషయంలో ఇగో పక్కన పెట్టె అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్. అందుకే ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవిని ఈ ఈవెంట్ కు పిలవాలి అని బన్నీ వర్కౌట్ చేస్తున్నాడు. ముందు అల్లు అరవింద్ తో కాల్ చేయించినట్టు టాక్. ఆ తర్వాత బన్నీ కాల్ చేసే ఛాన్స్ ఉంది.
బెంగళూరు ఈవెంట్ తర్వాత బన్నీ… చిరంజీవికి కాల్ చేసి ఈవెంట్ కు ఇన్వైట్ చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా చిరంజీవిని, రామ్ చరణ్ ను ఇన్వైట్ చేయడానికి రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ కు రామ్ చరణ్ తో మంచి రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ తోనే రామ్ చరణ్ ను ఇన్వైట్ చేయడానికి రెడీ అయ్యారు. సినిమా వెయ్యి కోట్లు రీచ్ కావాలంటే ఇగో ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని అల్లు అరవింద్ కూడా బన్నీకి చెప్పినట్టు టాక్. మరి చిరంజీవి, పవన్ ఆ ఈవెంట్ కు వస్తారా లేదా అనేది చూడాలి.