Allu Arjun Romance  Trisha : త్రిషతో అల్లు అర్జున్ రొమాన్స్.. తలపట్టుకుంటున్న ఫ్యాన్స్..

గురూజీ త్రివిక్రమ్ కన్ను.. త్రిష మీద పడిందని తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం.. గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎట్టకేలకు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తుండడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 24, 2023 | 04:54 PMLast Updated on: Nov 24, 2023 | 4:54 PM

Allu Arjun Romance With Trisha

గురూజీ త్రివిక్రమ్ కన్ను.. త్రిష మీద పడిందని తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం.. గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎట్టకేలకు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తుండడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో లాంటి మూడు హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో సారి ఈ కాంబో రిపీట్ కానుండటంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.

Guntur Karam : త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్.. గుంటూరు కారం లో యంగ్ టైగర్.. పూనకాలే

ఒక పక్క గుంటూరు కారం ఫైనల్ స్టేజ్ కి వచ్చేయడంతో.. గురూజీ.. బన్నీ సినిమా పై కూడా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బన్నీ కోసం హీరోయిన్ ను వెతికే వేటలో పడ్డాడట. చాలామందిని చూస్తూ.. చివరికి త్రిష వద్దకు వచ్చి ఆగినట్లు సమాచారం. బన్నీకి ఈడుజోడు బావుంటుంది అని, అంతేకాకుండా కథలో పాత్రకు బలంచేకూరేలా ఆమె నటన ఉంటుందని త్రివిక్రమ్.. త్రిషను ఓకే చేసినట్లు సమాచారం అందుతుంది.

ప్రభాస్ వర్షం సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. ఎవరిని వదలకుండా అందరితో నటించి మెప్పించింది.ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తో ఛాన్స్ పట్టేసింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా కూడా అల్లు అర్జున్ కు త్రిషకు రొమాన్స్ సెట్ అయ్యేలా లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే .. ప్రస్తుతం త్రిష గ్లామర్ పాత్రలను చేయడం లేదు. ఇక బన్నీ కన్నా ఒక ఏడాది చిన్నదే అయినా కూడా ఆమె.. బన్నీ పక్కన అక్కలా కనిపిస్తుంది అనే భావన ఫ్యాన్స్ లో ఎక్కువ అయిపోతుంది. అందుకే.. గురూజీ.. మరోసారి ఆలోచించు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.